ETV Bharat / entertainment

ప్రభాస్ 'బుజ్జి'పై నాగచైతన్య స్పెషల్ రైడ్​ - ఇంకా షాక్‌లోనే ఉన్నానంటూ పోస్ట్! - Naga chaitanya Kalki Bujji Car

author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 1:27 PM IST

Naga chaitanya Kalki Bujji Car : ప్రభాస్ బుజ్జిని హీరో నాగచైతన్య రైడ్ చేసి ఆ అనుభవాన్ని సోషల్ మీడియాలో తెలిపారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

Source ETV Bharat and ANI
prabhas nagachaitanya (Source ETV Bharat and ANI)

Naga chaitanya Prabhas Kalki Bujji Car : దర్శకుడు నాగ్ అశ్విన్ తన కల్కి 2898 ఏడీ చిత్రం కోసం కొత్త ప్రపంచాల్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అలా తన ప్రాజెక్ట్ కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని ఆటో మొబైల్ రంగంలో ది బెస్ట్ టీమ్​ను సంప్రదించి స్పెషల్‌గా ఓ కారును తయారు చేయించుకున్నాడు. దానికి బుజ్జి అనే పేరు పెట్టి స్పెషల్ గ్రాండ్ ఈవెంట్​ను రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడా కారును హీరో నాగచైతన్య రైడ్ చేసి ఆ అనుభవాన్ని సోషల్ మీడియాలో తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళితే - సాధారణంగానే హీరో నాగ చైతన్యకు కార్లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ స్పోర్ట్స్ కార్లంటే మరింత పిచ్చి. ఎప్పుడూ స్పోర్ట్స్ కార్లలో రేసింగ్ చేస్తూ అనుభూతిని పొందుతూ ఉంటారు. ఆ మక్కువతోనే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ మోటార్ స్పోర్ట్ రేసింగ్ టీమ్‌కు ఓనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా ఆయన ప్రభాస్ స్పెషల్ ఫ్రెండ్​ బుజ్జిని కలిసారు. బుజ్జితో కలిసి స్పీడ్ డ్రైవ్ చేస్తూ థ్రిల్ అయ్యారు. ఆ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఓ వీడియో రూపంలో షేర్ చేసి తెలియజేశారు. ఆ భారీ కారు తయారీని చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఇంకా తాను షాక్‌లోనే ఉన్నానని, ఇంజనీరింగ్‌కు సంబంధించిన అన్ని రూల్స్‌ను బ్రేక్ చేశారని బుజ్జి టీంపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Naga chaitanya Thandel Movie Shooting : ప్రస్తుతం చైతూ తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక. బన్నీ వాస్‌ నిర్మాత. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. దేశభక్తి అంశాలతో నిండిన రా రస్టిక్‌ ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చైతన్య రాజు అనే మత్స్యకారుడిగా కనిపించనున్నారు. సినిమాకు దేవీ శ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. షామ్‌ దత్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

'బుజ్జి' ప్రత్యేకతలివే - వామ్మో ఈ కారు కోసమే అన్ని కోట్లు ఖర్చుపెట్టారా? - Kalki 2898 AD Bujji Car Features

'ఆ స్టార్ హీరోకు అస్సలు సిగ్గులేదు - బట్టలు లేకుండా తిరుగుతాడు!' - Parineeti chopra

కేన్స్​లో చరిత్ర సృష్టించిన అనసూయ - సెక్స్ వర్కర్​ పాత్రకు ఉత్తమ నటిగా అవార్డు - Cannes Film Festival 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.