తెలంగాణ

telangana

IND Vs ENG: లంచ్​ విరామానికి టీమ్ఇండియా 108/1

By

Published : Sep 4, 2021, 5:36 PM IST

Updated : Sep 4, 2021, 6:17 PM IST

నాలుగో టెస్టు మూడో రోజు టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్​ కొనసాగిస్తోంది. లంచ్​ విరామానికి ఒక వికెట్​ నష్టపోయిన టీమ్ఇండియా.. తొలి సెషన్​లో 108 పరుగులు చేసింది. ఫలితంగా 9 పరుగుల ఆధిక్యంలో భారత్​ కొనసాగుతోంది.

IND Vs ENG 4th Test Day 3
IND Vs ENG: లంచ్​ విరామానికి టీమ్ఇండియా /1

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(47*), కేఎల్‌ రాహుల్‌(46) తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించారు. జట్టు భారీ స్కోర్‌ సాధించడానికి గట్టి పునాదులు వేశారు. ఈ క్రమంలోనే అర్ధశతకానికి చేరువైన రాహుల్‌.. అండర్సన్‌ బౌలింగ్‌లో కీపర్ బెయిర్‌స్టో చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. దీంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది.

అనంతరం రోహిత్‌, పుజారా(14) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి సెషన్‌ను పూర్తి చేశారు. అప్పటికి జట్టు స్కోర్‌ 108/1గా నమోదైంది. ప్రస్తుతం టీమ్‌ఇండియా లీడ్‌ 9 పరుగులుగా ఉంది.

అరుదైన ఘనత

టీమ్ఇండియా ఓపెనర్​ రోహిత్​ శర్మ అంతర్జాతీయ క్రికెట్​లో మరో మైలురాయిని చేరుకున్నాడు. ఓపెనర్​గా అన్ని ఫార్మాట్లలో కలిపి 11 వేల పరుగులను నమోదు చేశాడు. ఈ రికార్డు అందుకున్న రెండో బ్యాట్స్​మన్​గా రోహిత్​ నిలిచాడు. సచిన్​ తెందూల్కర్​ 241 ఇన్నింగ్స్​లలో ఈ మైలురాయిని చేరుకోగా.. రోహిత్​ శర్మ 246 ఇన్నింగ్స్​లలో ఈ ఘనత సాధించాడు. వీరి తర్వాత మూథ్యూ హెడెన్​(251 ఇన్నింగ్స్​), సునీల్​ గావస్కర్​(258 ఇన్నింగ్స్​) ఉన్నారు.

ఇదీ చూడండి..IND Vs ENG: గెలవాలంటే భారత్​ నిలవాల్సిందే!

Last Updated :Sep 4, 2021, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details