ETV Bharat / sports

IND Vs ENG: గెలవాలంటే భారత్​ నిలవాల్సిందే!

author img

By

Published : Sep 3, 2021, 11:24 PM IST

IND Vs ENG 4th Test Day 2: Rohit, Rahul start well in Second Innings
టీమ్ఇండియా Vs ఇంగ్లాండ్​

నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా ఓపెనర్లు ఆచితూచి బ్యాటింగ్​ చేస్తున్నారు. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్​ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్​ రాహుల్​(22), రోహిత్​ శర్మ(20) ఉన్నారు.

ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా ఓపెనర్లు ఆచితూచి బ్యాటింగ్​ చేస్తున్నారు. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్​ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్​ రాహుల్​(22), రోహిత్​ శర్మ(20) ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 290 పరుగులకు ఆలౌటైంది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఓలీపోప్‌ (81), క్రిస్‌వోక్స్‌ (50) అర్ధ శతకాలతో మెరిశారు. జానీ బెయిర్‌స్టో (37), మొయిన్‌ అలీ (35) కూడా తమవంతు పరుగులు చేశారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌.. భారత్‌పై 99 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో ఉమేశ్‌ మూడు.. బుమ్రా, జడేజా రెండు వికెట్లు తీయగా శార్దూల్‌, సిరాజ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు 55/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ ఆదిలోనే క్రేగ్‌ ఓవర్టన్‌ (1), డేవిడ్‌ మలన్‌ (31) వికెట్లను కోల్పోయింది. ఉమేశ్‌ ఇద్దరు బ్యాట్స్​మెన్​ను పెవిలియన్‌ పంపి భారత శిబిరంలో ఆశలు రేపాడు. అయితే, తర్వాత క్రీజులోకి వచ్చిన పోప్‌ నిలకడగా ఆడి ఆ జట్టు మంచి స్కోర్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత బెయిర్‌స్టోతో కలిసి ఆరో వికెట్‌కు 89 పరుగులు జోడించిన అతడు తర్వాత మొయిన్‌ అలీతో కలిసి ఏడో వికెట్‌కు 76 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే కీలక సమయాల్లో ఈ ముగ్గురూ ఔటైనా చివర్లో క్రిస్‌వోక్స్‌ ధాటిగా ఆడి ఇంగ్లాండ్‌ను మెరుగైన స్థితిలో నిలిపాడు.

ఇదీ చూడండి.. IND Vs ENG: వోక్స్​ హాఫ్ సెంచరీ.. ఇంగ్లాండ్​ ఆలౌట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.