తెలంగాణ

telangana

సింగర్​గా మారిన మిస్టర్ కూల్.. బిగ్ బీ పాటతో ఫుల్​ జోష్​

By

Published : Dec 10, 2019, 10:34 AM IST

ప్రస్తుతం క్రికెట్​కు దూరంగా ఉంటున్న ధోనీ.. సింగర్ అవతారమెత్తాడు. ఓ కార్యక్రమంలో అమితాబ్ సినిమా కబీ కబీలోని మెలోడీ సాంగ్ పాడుతూ అలరించాడు.

dhoni singing going to viral on social media
సింగర్​గా మారిన మిస్టర్ కూల్.. బిగ్ బీ పాటతో ఫుల్​ జోష్​

మైదానంలో కూల్​గా ఉంటూ.. ప్రత్యర్థుల వ్యూహాలను ముందే పసిగట్టండలో మహేంద్రసింగ్​ ధోనీ దిట్ట. ప్రస్తుతం క్రికెట్​కు తాత్కాలిక విరామం తీసుకున్న మహీ.. ఓ కార్యక్రమంలో సింగర్ అవతామెత్తి పాట పాడుతూ అలరించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమల్లో వైరల్​ అవుతోంది.

అమితాబ్​ బచ్చన్ సినిమా కబీ కబీలోని మెలోడీ సాంగ్ పాడుతూ ఆకట్టుకున్నాడు మహీ. ధోనీ గాయకుడిగా మారడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన కార్యక్రమంలోనూ స్నేహితుడితో కలిసి గొంతు కలిపాడు. బాలీవుడ్‌ చిత్రం జుర్మ్‌లో జబ్‌ కోయ్‌ బాత్‌ బిగాద్ జయా పాటను పాడాడు.

ప్రపంచకప్ సెమీస్‌ అనంతరం క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు ధోనీ. వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సిరీస్‌లకు అతడు దూరంగా ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా తిరిగి మైదానంలో ప్రాక్టిస్‌ మొదలుపెట్టాడు. వచ్చే ఐపీఎల్లో సత్తాచాటి టీ20 వరల్డ్​కప్​ సమయానికి టీమిండియాలోకి వస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: స్పాట్​ ఫిక్సింగ్​ కుంభకోణంలో పాక్ ఓపెనర్

ABOUT THE AUTHOR

...view details