తెలంగాణ

telangana

అతడిచ్చిన సలహాల వల్లే మెరుగ్గా రాణిస్తున్నా: చాహల్​

By

Published : Feb 2, 2022, 12:04 PM IST

Updated : Feb 2, 2022, 12:14 PM IST

Chahal Daniel Vetori: న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు డేనియల్ వెటోరీ ఇచ్చిన సలహాతోనే ఇన్నాళ్లు మెరుగ్గా రాణించగలుగుతున్నానని అన్నాడు లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌. ఇటీవల సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన అతడు పలు విషయాలను వెల్లడించాడు.

chahal ipl
చాహల్​ ఐపీఎల్​

Chahal Daniel Vetori: తాను నాణ్యమైన స్పిన్నర్​గా ఎదిగేందుకు న్యూజిలాండ్​ మాజీ ప్లేయర్​ డేనియల్​ వెటోరీ చాలా సహకారం అందించాడని అన్నాడు లెగ్​ స్పిన్నర్​ చాహల్​. అందుకే తాను ఇనేళ్లుగా మెరుగ్గా రాణించగలుగుతున్నట్లు తెలిపాడు.

"2014లో నేను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ఎంపికైన సమయంలో న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు డేనియల్ వెటోరీ హెడ్‌ కోచ్‌గా ఉండేవాడు. నేను నాణ్యమైన స్పిన్నర్‌గా ఎదిగేందుకు అతడు చాలా సహకారం అందించాడు. ఒక బౌలర్‌గా, అనుభవమున్న క్రికెటర్‌గా నాకు చాలా సలహాలు చెప్పాడు. నా బౌలింగ్‌ యాక్షన్‌ మార్చుకోకుండా బంతిని ఎలా వేయాలనే విషయంపై కొన్ని సూచనలు చేశాడు. నాతో నెట్స్‌లో అదనపు ఓవర్లు బౌలింగ్‌ చేయించేవాడు. నేను మరింత మెరుగయ్యేందుకు అది ఉపయోగపడింది. 3-4 మ్యాచులు ఆడిన తర్వాత నేను బౌలింగ్‌ చేసిన వీడియోలను పంపేవాడు. ఏమైనా మార్పులు ఉంటే చెప్పేవాడు" అని చాహల్ అన్నాడు.

"ఐపీఎల్‌లో 14 మ్యాచులుంటాయి. అందులో 3, 4 మ్యాచుల్లో విఫలమైనా, మిగతా మ్యాచుల్లో మాత్రం కచ్చితంగా మెరుగ్గా రాణించాలి. ఎకానమీ కూడా 7 లోపే ఉండేలా చూసుకోవాలి. మణికట్టుతో మ్యాజిక్‌ చేయాలి. బంతిని రిలీజ్‌ చేసే సమయంలో మణికట్టు స్థానాన్ని మార్చి.. ప్రత్యర్థి బ్యాటర్‌ను తికమక పెట్టాలని చెప్పేవాడు. ఇప్పటికీ నేను ఇదే విషయాన్ని అనుసరిస్తున్నాను" అని చాహల్ చెప్పాడు. ఐపీఎల్‌లో చాహల్‌ ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

తొలి సంపాదనతో కారు కొన్నాను

ఐపీఎల్‌ వేలంలో తొలిసారి దక్కిన డబ్బుతో.. ఓ సెకండ్‌ హ్యాండ్‌ కారు కొన్నానని హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం సిరాజ్‌ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు.

"ఐపీఎల్ ద్వారా తొలిసారి అందుకున్న డబ్బుతో ఐఫోన్‌ 7ప్లస్‌, ఓ సెకండ్ హ్యాండ్ కారు (టయోటా కంపెనీకి చెందిన కరోలా) కొన్నాను. ఐపీఎల్‌లో ఆడుతున్నామంటే ఆ మాత్రం ఉండాలి కదా! ఎంత కాలమని పాత బైక్‌పై తిరుగుతాం? అందుకే కారు కొన్నా. అప్పటికీ నాకు డ్రైవింగ్ కూడా రాదు. దీంతో మా కజిన్‌ని డ్రైవింగ్‌కి తీసుకెళ్లేవాడిని" అని సిరాజ్‌ వెల్లడించాడు.

తొలుత సిరాజ్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ తరఫున ఆడాడు. అరంగేట్ర సీజన్‌లో ఆడిన 6 మ్యాచుల్లోనే 10 వికెట్లు పడగొట్టడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2017 ఐపీఎల్‌ వేలంలో 2.6 కోట్లు వెచ్చించి బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది. తాజాగా, బెంగళూరు యాజమాన్యం విరాట్‌ కోహ్లీ (రూ. 15 కోట్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (రూ. 11 కోట్లు), మహమ్మద్‌ సిరాజ్‌ (రూ. 7 కోట్లు)లను రిటెయిన్‌ చేసుకుంది.


ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్​ విజయం.. 24ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

Last Updated : Feb 2, 2022, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details