ETV Bharat / sports

ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్​ విజయం.. 24ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

author img

By

Published : Feb 2, 2022, 11:09 AM IST

Under-19 World cup: అండర్​-19 ప్రపంచకప్​ టోర్నీలో భాగంగా అఫ్గానిస్థాన్​తో జరిగిన సెమీఫైనల్​లో 15 పరుగులు తేడాతో విజయం సాధించింది ఇంగ్లాండ్​. దీంతో 24ఏళ్ల తర్వాత ఆ జట్టు తొలిసారి ఫైనల్​లో అడుగుపెట్టినట్లైంది. జార్జ్​ బెల్​కు ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

Under-19 world cup
Under-19 world cup

Under-19 World cup: అండర్​-19 ప్రపంచకప్​ టోర్నీలో భాగంగా అఫ్గానిస్థాన్​తో జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్​ జట్టు విజయం సాధించింది. 15 పరుగులు తేడాతో గెలిచి ఫైనల్​కు అర్హత సాధించింది. దీంతో 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. జార్జ్​ బెల్​కు ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది. కాగా, వర్షం కారణంగా ఈ మ్యాచ్​ను 47 ఓవర్లకు కుదించారు.

232 పరుగుల లక్ష్య ఛేధనకు బరిలో దిగిన అఫ్గానిస్థాన్​ 47 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 215 పరుగులు మాత్రమే చేసింది. అల్లా నూర్​(60) అర్ధసెంచరీతో మెరవగా.. మహ్మద్​ ఇషాక్​(43), అబ్దుల్​ హది(37), నూర్​ అహ్మద్​(25) రాణించారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో రెహాన్ అహ్మద్​ 4, థామస్​ అస్పిన్​వాల్​ 2, జాష్వా, టామ్​ ప్రెస్ట్​ తలో వికెట్​ తీశారు.

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఇంగ్లాండ్​.. 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఓపెనర్​ జార్జ్​ థామస్(50), జార్జ్​ బెల్(56), అలెక్స్​ హోర్టన్​(53) హాఫ్​ సెంచరీలతో మెరిశారు. మిగతా వారు విఫలమయ్యారు. అఫ్గాన్​ బౌలర్లలో నవీద్​ జద్రన్​ 2, నూర్​ అహ్మద్​ 2 తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు.

ఇదీ చూడండి:

కెరీర్​పై సానియా మీర్జా కీలక నిర్ణయం!

Under-19 Worldcup Semifinal: నేడే ఆసీస్‌తో భారత్‌ సమరం

24 ఏళ్ల తర్వాత కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో క్రికెట్‌.. తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే?

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.