తెలంగాణ

telangana

Kohli Birthday: కోహ్లీ బర్త్​డే.. అనుష్క శర్మ స్పెషల్​ విషెస్

By

Published : Nov 5, 2021, 1:47 PM IST

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ(Virat Kohli birthday) పుట్టిన రోజు సందర్భంగా అతడి సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma News) స్పెషల్​గా విష్ చేసింది. ఇన్​స్టా వేదికగా కోహ్లీని పొగుడుతూ ఓ భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది.

virat anushka sharma
విరాట్ అనుష్క శర్మ

టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ పుట్టిన రోజు(virat kohli birthday) నేడు(నవంబర్ 5). ఈ సందర్భంగా క్రికెటర్లు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా కోహ్లీకి(virat kohli birthday wishes) శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి, కోహ్లీ సతీమణి అనుష్క శర్మ(Anushka Sharma News) భిన్నంగా తన ప్రేమను పంచుకుంది. విరాట్​ను పొగుడుతూ ఇన్​స్టా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ చేసింది. 'నిజాయతీకి మారుపేరు' అంటూ ప్రశంసించింది.

"ఈ ఫొటోకు, నువ్వు జీవితాన్ని ముందుకు నడిపించే తీరుకు ఎలాంటి ఫిల్టర్​ అప్లై చేయాల్సిన పనిలేదు. నిజాయతీకి, గుండె ధైర్యానికి మారుపేరు నువ్వు. వైఫల్యాలను అధిగమించి నీలా ముందుకు సాగినవారిని నేను ఎప్పుడూ చూడలేదు. ప్రతి విషయంలోనూ నువ్వు గొప్పవాడిగా ఎదుగుతావు. జీవిత భాగస్వామిగా నన్ను స్వీకరించినందుకు ధన్యవాదాలు."

-అనుష్క శర్మ, నటి.

యూఏఈలో దీపావళి పండగ రోజున దిగిన ఓ ఫొటోకు ఈ క్యాప్షన్ జోడించింది అనుష్క శర్మ. "సామాజిక మాధ్యమాల వేదికగా మనం ఇలా మాట్లాడుకునే వాళ్లం కాదు. కానీ, నీ గొప్పతనం గురించి అందరితో పంచుకోవాలని అనిపించింది" అని అనుష్క పేర్కొంది.

కాగా, విరుష్క జంటకు 2017 డిసెంబర్ 11న ఇటలీలో వివాహం జరిగింది. ఇటీవలే పుట్టిన తమ పాపకు వామిక అని పేరు పెట్టారు. ఇప్పటివరకు ఆ పాప ముఖాన్ని బహిర్హతం చేయకపోవడం విశేషం.

ఇదీ చదవండి:

Kohli Birthday: ఆగని పరుగుల ప్రవాహం.. విజయాల దాహం!

ABOUT THE AUTHOR

...view details