తెలంగాణ

telangana

ఆ హీరో రెడ్ ​హ్యాండెండ్​గా దొరికాడు.. అందుకే వదిలేశా!

By

Published : Mar 13, 2020, 6:39 PM IST

ప్రముఖ బాలీవుడ్​ నటి దీపికా పదుకొణె.. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంది. గతంలో జరిగిన ప్రేమ వ్యవహారాలలో తాను ఎవ్వరినీ మోసం చేయలేదని చెప్పింది. అంతేకాకుండా ఓ హీరో గురించి సంచలన విషయం బయటపెట్టింది.

When Deepika opened up on relationship woes
'అతనికి రెండో అవకాశం ఇచ్చి తప్పు చేశాను'

బాలీవుడ్​ నటి దీపికా.. హీరో రణ్‌వీర్ సింగ్‌ను వివాహం చేసుకొని ప్రస్తుతం ఆనందంగా ఉంది! అయితే గతంలో హీరో రణ్​బీర్ కపూర్‌తో జరిగిన ప్రేమ వ్యవహారం తన జీవితాన్ని మార్చిందని చెప్పుకొచ్చింది. ఒకానొక సమయంలో మానసిక ఒత్తిడికి గురయ్యానని చెప్తూ.. తన ప్రేమాయణం గురించి పలు విషయాలు బహిర్గతం చేసింది!

"నా దృష్టిలో శృంగారం అంటే కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు. అందులో ఎన్నో భావోద్వేగాలు కలిసి ఉంటాయి. నేను ప్రేమలో ఉన్నప్పుడు ఎవరినీ మోసం చేయలేదు. ఆ వ్యక్తిని కాదని పక్కకు వెళ్లలేదు. బహుశా అందుకే గతంలో నేను బాధపడ్డానేమో. అతడు (మాజీ ప్రియుడు) మోసం చేస్తున్నాడని నా చుట్టూ ఉన్న వ్యక్తులు చెబుతున్నా.. అతడు వేడుకోవడం వల్ల రెండో అవకాశం ఇచ్చా. అది నా మూర్ఖత్వం. ఆ తర్వాత నేను అతడ్ని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నా. దాన్నుంచి తేరుకోవడానికి చాలా రోజులు పట్టింది. కానీ ఒక్కసారి బయటపడ్డాక వెనక్కి తిరిగి చూసుకోలేదు"

- దీపికా పదుకొణె, బాలీవుడ్​ నటి.

" మొదటిసారి అతడు(మాజీ ప్రియుడు) నన్ను మోసం చేశాడు. ఆ సమయంలో ఈ ప్రేమ బంధంలో పొరపాటు జరుగుతోందా?, లేక నాలో పొరపాటు ఉందా? అనుకున్నా. కానీ ఓ వ్యక్తి మోసం చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నప్పుడు.. సమస్య అతడిలో ఉందని అర్థమైంది. ప్రేమలో ఉన్నప్పుడు నేను చాలా ఇచ్చా, అంతే ప్రేమను అతడి నుంచి ఆశించలేదు. మోసం ఓ బంధాన్ని బ్రేక్‌ చేస్తుంది. ఒక్కసారి అలా జరిగితే గౌరవం, నమ్మకం పోతుంది. ఇవే బంధానికి మూలస్తంభాలు. అవి కూలిన తర్వాత ప్రేమ నిలబడదు" అని దీపిక తెలిపింది.

దీపికా పదుకొణే

దీపికా, రణ్‌బీర్‌ రెండేళ్లు ప్రేమలో ఉన్నారు. 2009లో విడిపోయారు. దాదాపు ఎనిమిదేళ్ల ప్రేమ తర్వాత రణ్‌వీర్‌ సింగ్​ను 2018లో వివాహం చేసుకుంది. రణ్‌బీర్‌ ప్రస్తుతం నటి ఆలియా భట్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ ఒకరిపై మరొకరి ప్రేమను మీడియా ముందు కూడా పరోక్షంగా వెల్లడించుకున్నారు. త్వరలో వీరి పెళ్లని వార్తలు వస్తున్నాయి.

ఇదీ చూడండి.. కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పిన పూరీ జగన్నాథ్

ABOUT THE AUTHOR

...view details