తెలంగాణ

telangana

'విక్కీ-కత్రిన వెడ్డింగ్'​.. వావ్​ అనిపించేలా వేడుకలు!

By

Published : Dec 7, 2021, 2:54 PM IST

Updated : Dec 7, 2021, 5:07 PM IST

Vicky Kaushal and Katrina Kaif wedding: విక్కీ కౌశల్​, కత్రినా కైఫ్​.. బీటౌన్​లో ఇప్పుడు వీరిద్దరే హాట్​టాపిక్​. వీరి పెళ్లి వేడుకకు సర్వం సిద్ధమైంది. వివాహం జరిగే కోటను ఇప్పటికే గ్రాండ్​గా ముస్తాబు చేశారు. పసందైన వంటలు చేస్తున్నారు. భారీ వెడ్డింగ్​లో భద్రత చాలా ముఖ్యం. మరి ఈ స్పెషల్​ వెడ్డింగ్​లో భద్రతా ఏర్పాట్లను ఎవరు చూసుకుంటున్నారో మీకు తెలుసా?

Vicky Kaushal and Katrina Kaif marriage venue
'విక్కి- కత్రిన వెడ్డింగ్'​.. వావ్​ అనిపించేలా వేడుకలు..!

Vicky Kaushal and Katrina Kaif marriage venue: బాలీవుడ్​లో ఇప్పుడు ఎటుచూసినా విక్కీ కౌశల్​- కత్రినా కైఫ్​ పెళ్లి గురించే చర్చ. ఏ విషయాన్నీ బయటపెట్టకుండా, అత్యంత గోప్యంగా ఈ వేడుకలు జరుగుతుండటం.. ప్రజల్లో, వారి అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేసింది. అప్పుడప్పుడు బయటకొస్తున్న ఫొటోలు, విమానాశ్రయాల్లో తారల సందడితో హైప్​ మరింత పెరిగింది. విక్​కాట్​ జోడీ వివాహ వేడుకల్లో హైలైట్స్​పై మీరూ ఓ లుక్కేయండి.

  • మంగళవారం రాత్రి సంగీత్​తో వివాహ వేడుకలు మొదలవుతాయి. ఇందుకోసం విక్కీ కౌశల్​- కత్రినా కైఫ్​, వారి స్నేహితులు, కుటుంబసభ్యులు సోమవారమే.. వేడుక జరిగే రాజస్థాన్​ భర్వారా కోటకు చేరుకున్నారు. బాణసంచాతో వారందరికి స్వాగతం లభించింది. ఈ క్రమంలో కోట ధగధగ మెరిసిపోయింది.
    భర్వారా కోట
  • సంగీత్​లో విక్కీ కోసం కత్రిన.. ప్రత్యేకంగా డ్యాన్స్​ చేస్తుందని తెలుస్తోంది. బుధవారం ఉదయం 11గంటలకు హల్దీ వేడుకలు ఉంటాయి. ఈ మధ్యలో మెహందీ వేడుకలూ ఉండనున్నాయి. సేంద్రీయ మెహందీ.. వేడుకల్లో హైలైట్​గా నిలవనుంది. మెహందీ పౌడర్​తో పాటు 20కేజీలతో కూడిన 400కోన్లను సరఫరా చేశారు. రాజస్థాన్​లోని సోజాత్​ ఈ మెహందీని సరఫరా చేసింది. 9వ తేదీన సెహ్రబంది వంటి వేడుకలు ఉంటాయి. పెళ్లి.. హిందూ సంప్రదాయంతో పాటు పాశ్చాత్య ఆచారాల ప్రకారం రెండుసార్లు జరుగుతుందని ఊహాగానాలు జోరందుకున్నాయి. తొలుత.. 9వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు హిందూ సంప్రదాయానికి తగ్గట్టు వారి వివాహం జరుగుతుంది. ఆ తర్వాత ఇరువురు చౌతా మాతా మందిరానికి వెళతారు. మొత్తం మీద 12వ తేదీ వరకు వీరిద్దరు జైపుర్​లోనే ఉంటారు.
  • పెళ్లి సమయంలో విక్కీ కౌశల్​ ఎంట్రీని గ్రాండ్​గా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. అతిపెద్ద బరాత్​తో.. ఏడు గుర్రాలతో కూడిన రథంపై విక్కీ పెళ్లి మండపానికి వెళతారని సమాచారం.
    విక్కీ నివాసం వద్ద కత్రిన
  • భారీ వెడ్డింగ్​ కోసం జైపుర్​ ముస్తాబైంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 6 నుంచి 12 వరకు చౌతా మాతా ఆలయానికి వెళ్లే రోడ్లను మూసివేశారు. దీనిపై రాజస్థాన్​కు చెందిన ఓ న్యాయవాది ఫిర్యాదు కూడా చేశారు. వివాహ వేడుకలు జరిగినా పర్లేదు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా రోడ్లను మూసివేయడం తగదన్నది ఆయన వాదన.
  • Vickat marriage: విక్కీ కౌశల్​- కత్రిన పెళ్లి సందర్భంగా.. ముంబయి, జైపుర్​ విమానాశ్రయాల్లో తారల సందడి నెలకొంది. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఫిల్మ్​మేకర్​ కబీర్​ ఖాన్​, నేహా దూపియా, అంగద్​ బేడీతో పాటు పలువురు సినీ ప్రముఖులు ముంబయి నుంచి జైపుర్​కు వెళ్లారు. అటు విదేశాల నుంచీ కత్రిన సన్నిహితులు జైపుర్​కు వచ్చారు.
    కత్రినా కైఫ్​
  • వివాహ వేడుకలను అత్యంత గోప్యంగా ఉంచాలని విక్కీ, కత్రిన భావించారు. అనేక నిబంధనలు విధించినట్టు తెలుస్తోంది. కొవిడ్​ నేపథ్యంలో పూర్తిగా టీకా తీసుకుని, ఆర్​టీపీసీఆర్​ పరీక్ష చేయించుకున్న వారికే అనుమతులుంటాయని సమాచారం. అయితే సన్నాహాలకు సంబంధించిన దృశ్యాలు ఎప్పటికప్పుడు లీక్​ అవుతున్నాయి. ముఖ్యంగా భర్వారా కోట ముస్తాబవుతున్న వీడియో బయటకు వచ్చింది.
  • ఇంతటి గ్రాండ్​ ఈవెంట్​లో సెక్యూరిటీ చాలా ముఖ్యం. ఇందుకోసం నటుడు సల్మాన్​ ఖాన్​ బాడీగార్డ్​ షేరా, అతని బృందం రంగంలోకి దిగినట్టు సమాచారం. ప్రతి విషయాన్ని ప్రత్యేకంగా పరిగణించి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే కత్రిన వివాహానికి సల్మాన్​ ఖాన్​ వస్తారా? లేదా? అన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు.

కత్రినా కైఫ్‌-విక్కీ కౌశల్‌ వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల ప్రసారహక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థరూ. 100కోట్ల భారీ ఆఫర్‌ ఇచ్చిందట. అయితే, ఈ విషయంలో కత్రినా-విక్కీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ ట్రెండ్‌ కొత్తేం కాదు.. గతంలోనూ పలువురు సెలబ్రిటీలు తమ వివాహ ఫుటేజ్‌ల ప్రసారాల కోసం సినీ మ్యాగజైన్లు, ఫొటోగ్రాఫర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే, ఒక ఓటీటీ సంస్థ వివాహ వేడుక ప్రసార హక్కులను పొందేందుకు ప్రయత్నించడం ఇదే తొలిసారి.

ఇవీ చూడండి:-ఈ హీరోయిన్లు వ్యాపారాల్లోనూ తగ్గేదేలే!

Last Updated :Dec 7, 2021, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details