ETV Bharat / sitara

ఈ హీరోయిన్లు వ్యాపారాల్లోనూ తగ్గేదేలే!

author img

By

Published : Nov 19, 2021, 3:49 PM IST

ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ ముగిస్తేనే రెండో ఇన్నింగ్స్‌! ఇది క్రికెట్‌లో నిబంధన. కానీ, మన హీరోయిన్లకు అంత ఓపిక లేదండోయ్‌! యాక్టింగ్‌ కెరీర్‌ ముగియకముందే వ్యాపారం(Actresses in business) అనే రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టేస్తున్నారు. సిక్సర్లు బాదేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనేలా! ఇంతకీ ఎవరు ఏ వ్యాపారాల్లో ఉన్నారు? అని తెలుసుకోవాలనుందా? ఇవిగో ఆ వివరాలు..

actresses business
హీరోయిన్ల వ్యాపారాలు

'దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి' ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు కొందరు హీరోయిన్లు. ఓ వైపు యాక్టింగ్​లోనే రాణిస్తూనే మరో వైపు వ్యాపారాల్లో(Actresses in business) హిట్లు కొడుతున్నారు. ఆ హీరోయిన్లు ఎవరు? వాళ్లు చేసే వ్యాపారాలేంటో(Actresses in business) ఇప్పుడు తెలుసుకుందాం..

ఎల్లలు దాటిన ప్రియాంక

బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేస్తోంది ప్రియాంక చోప్రా. అలాగే వ్యాపారంలోనూ(Actresses in business) ఒక్క రంగానికే పరిమితం కాలేదు. 'పర్పుల్‌ పెబెల్‌ పిక్చర్స్‌' పేరుతో ఆమెకో సొంత నిర్మాణ సంస్థ ఉంది. 'అనోమలీ' పేరుతో కేశసౌందర్య ఉత్పత్తుల బ్రాండ్‌ నడిపిస్తోంది. కుర్ర జంటల్ని ఆకట్టుకోవడంలో ముందున్న 'బంబుల్‌' అనే డేటింగ్‌ యాప్‌లోనూ పెట్టుబడులు పెట్టింది. ఇంతేకాదండోయ్‌.. 'సోనా' బ్రాండ్‌తో ఆకాశహర్మ్యాల నగరం న్యూయార్క్‌లో రెస్టారంట్లనే నడిపిస్తోంది.

priyanka chopra business
ప్రియాంక చోప్రా

సౌందర్యానికే కత్రినా ఓటు

షేర్‌మార్కెట్‌లో కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా 'నైకా' గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లిస్టింగ్‌ రోజే ఈ ఆన్‌లైన్‌ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ బంపర్‌ లాభాలు రాబట్టింది. ఇందులో మన కత్రినాకైఫ్‌కి చెప్పుకోదగ్గ వాటా ఉందండోయ్‌! వాటాలు కాకుండా కేవలం లిస్టింగ్‌ రోజున కత్రినా రూ.22 కోట్ల లాభాలు మూటకట్టుకుందట. ఇదేకాదు.. 'కే బ్యూటీ కాస్మొటిక్స్‌' కంపెనీలోనూ క్యాట్‌ వ్యాపార భాగస్వామి.

katrina kaif business
కత్రినా కైఫ్​

అందరికన్నా ముందున్న దీపిక

కెరీర్‌ జోరు మీదున్నప్పుడే వ్యాపారంలోకి అడుగుపెట్టిన అమ్మడు దీపికా పదుకొణె. 'కేఏ ఎంటర్‌ప్రైజెస్‌' పేరుతో కుటుంబ సభ్యులతో కలిసి తొమ్మిదేళ్ల కిందటే ఓ వ్యాపార సంస్థ ప్రారంభించింది. 'ఎపిగామియా' అనే ఎఫ్‌ఎంసీజీ సంస్థ, 'ఫ్రంట్‌ రో' అనే ఎడ్యు స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టింది. 'బ్లూ స్మార్ట్‌' అనే ఎలక్ట్రిక్‌ టాక్సీ స్టార్టప్‌లోనూ వాటాలున్నాయి. బెల్లాట్రిక్స్‌ అనే ఏరోస్పేస్‌ టెక్నాలజీ కంపెనీలోనూ అడుగుపెట్టిందని టాక్‌. 'కేఏ ప్రొడక్షన్స్‌' నిర్మాణ సంస్థ తనదే.

deepika padukone business
దీపికా పదుకొణె

ఎదురులేని అనుష్క

నటనలోనే కాదు.. సినిమా నిర్మాణంలో దూసుకెళ్తున్న నటి అనుష్కశర్మ. ఇరవై ఏడు ఏళ్లకే 'క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌' ప్రొడక్షన్‌ హౌజ్‌కి యజమానురాలైంది తను. 'ఎన్‌హెచ్‌ 10' కమర్షియల్‌ హిట్‌ అందుకుంది. 'నుష్‌' పేరుతో ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ నిర్వహిస్తోంది. భర్త, క్రికెటర్‌ విరాట్‌ జిమ్‌ స్టూడియోల్లోనూ తన 'షేర్‌' ఉండనే ఉంది.

anushka sharma business
అనుష్క శర్మ

అలియా వైవిధ్యంగా..

లేత పరువాల సుందరి అలియా భట్‌ వ్యాపారంలోనూ ముందుంది. తనూ కత్రినాతోపాటు 'నైకా'లో భారీ పెట్టుబడులు పెట్టింది. దీంతోపాటు 'ఎడ్‌-ఎ-మమా' పేరుతో చిన్నపిల్లల కోసం డిజైనర్‌ దుస్తుల వ్యాపారం చేస్తోంది. 'ఎటర్నల్‌ సన్‌షైన్‌ ప్రొడక్షన్స్‌' సినిమా, టీవీ నిర్మాణ సంస్థలో భాగస్వామి అలియా.

alia bhat business
అలియా భట్‌

మన సమంత.. తగ్గట్లేదు

ఈ స్టార్ల జాబితాలో మన సమంతకీ చోటు దక్కింది. ఏడాది కిందటే 'సాకీ' పేరుతో సొంత దుస్తుల బ్రాండ్‌ మొదలుపెట్టింది. కేరళలో పేరున్న ఓ జ్యువెల్లరీ కంపెనీలోనూ తనకి వాటాలున్నాయన్నది కొన్ని పత్రికల సారాంశం. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి స్థానిక చేనేత కళాకారుల కోసం ప్రచారం చేస్తోంది.

samanta business
సమంత

క్రికెట్‌ బాటలో ప్రీతి

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఐపీఎల్‌ జట్టుకి ప్రీతి సహ యజమానురాలన్నది జగమెరిగిన విషయం. కానీ జనాలకు తెలియని సంగతి ఏంటంటే.. దక్షిణాఫ్రికాలోని జట్టు 'స్టెలెన్‌బాష్‌ కింగ్స్‌'కి సైతం తను ఓనరే. ముంబయిలో సొంతంగా రెండు రెస్టారంట్లు నిర్వహిస్తోంది. 'పీఎన్‌జడ్‌ఎన్‌' పేరుతో సొంత నిర్మాణసంస్థ కూడా ఉంది.

preeti zinta business
ప్రీతి

యోగా వ్యాపారవేత్త మలైకా

కుర్ర హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్న బాలీవుడ్‌ సుందరి మలైకా యోగాలో దిట్ట. దాన్నే తన వ్యాపారానికి అనువుగా మలుచుకుంది. 'సర్వ', 'దివ' పేరుతో ముంబయిలో రెండు యోగా స్టూడియోలు నిర్వహిస్తోంది. 'లేబుల్‌ లైఫ్‌' పేరుతో తనకో ఫ్యాషన్‌ బ్రాండ్‌ ఉంది. ఇది కేవలం అమ్మాయిలకే స్పెషల్‌.

malaika arora business
మలైకా

ఆల్‌రౌండర్‌ శిల్పాశెట్టి

నటనలో కన్నా వ్యాపారంలోనే శిల్పాశెట్టికి ఆల్‌రౌండర్‌ అనే పేరుంది. కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే ఈ అమ్మడు బిజినెస్‌లోకి దిగింది. యోగాసనాలతో సీడీలు రూపొందించడంతో మొదలైంది వ్యాపారం. తర్వాత యోగా స్టూడియోలు తెరిచింది. రెస్టారంట్ల వ్యాపారంలో దూసుకెళ్తోంది. లగ్జరీ స్పాలు నిర్వహిస్తోంది. 'ఎస్‌ఎస్‌' పేరుతో ఫ్యాషన్‌ బ్రాండ్‌ ప్రారంభించింది. రాజస్థాన్‌ రాయల్స్‌ ఐపీఎల్‌ జట్టులో తను భాగస్వామి.

shilpa shetty business
శిల్పా శెట్టి

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.