తెలంగాణ

telangana

ఈద్​కు రాబోతున్న సల్మాన్​.. ఆ దర్శకుడితో మూడోసారి

By

Published : Oct 18, 2019, 6:53 PM IST

'రాధే' సినిమాతో వచ్చే ఈద్​కు సందడి చేయబోతున్నాడు హీరో సల్మాన్​ఖాన్. ఈ సందర్భంగా ఫస్ట్​లుక్​ను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

ఈద్​కు రాబోతున్న సల్మాన్​.. ఆ దర్శకుడితో మూడోసారి

ప్రస్తుతం 'దబాంగ్​-3'తో బిజీగా ఉన్నాడు కండలవీరుడు సల్మాన్​ఖాన్. తాను చేయబోయే కొత్త చిత్రాన్నిశుక్రవారం ప్రకటించాడు. 'రాధే' పేరుతో రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఈద్​కు తెస్తున్నట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు. ఓ వీడియోను పంచుకున్నాడు.

సల్మాన్-సంజయ్​లీలా భన్సాలీ కాంబినేషన్​లో 'ఇన్షా అల్లా' చిత్రాన్ని వచ్చే ఈద్​కు తేవాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఈ పండుగకు తన చిత్రాన్ని కచ్చితంగా తీసుకొస్తాననిఅప్పుడే చెప్పిన ఈ హీరో.. ఇప్పుడు ఈ సినిమాను ప్రకటించాడు.

'దబాంగ్-3' రూపొందిస్తున్న ప్రభుదేవానే ఈ చిత్రానికీ దర్శకత్వం వహించబోతున్నాడు. ​సల్మాన్​ఖాన్ ఫిల్మ్స్, రీల్ లైఫ్ ప్రొడక్షన్స్​ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఇది సల్మాన్-ప్రభుదేవా కాంబినేషన్​లో వస్తోన్న మూడో సినిమా కావడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details