తెలంగాణ

telangana

ఆ ఇంటి కోడలిని కావాలన్నదే నా కోరిక: రష్మిక

By

Published : May 13, 2021, 2:58 PM IST

వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. తన పెళ్లి గురించి మాట్లాడింది. ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలిని అవుతానని చెప్పింది. అక్కడి సంప్రదాయాలు, ఆహార అలవాట్లు అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది.

rashmika about her marriage
రష్మిక

'హీ ఈజ్‌ సో క్యూట్‌...హీ ఈజ్‌ సో స్వీట్‌' అంటూ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో మహేశ్​బాబు ప్రేమికురాలిగా అలరించింది రష్మిక. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి హంగామా చేస్తోంది. గత ఏడాది 'నేషనల్ క్రష్‌ ఆఫ్‌ ఇండియా'గా ఎంపికై యువప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టింది. తమిళంలో కార్తి సరసన 'సుల్తాన్‌' చిత్రంలో నటించి అక్కడి ప్రేక్షకులకు చేరువైంది. ఇప్పుడు పెళ్లిపై స్పందిస్తూ మనసులోని మాటను వెల్లడించింది.

"నాకు తమిళ సంస్కృతి, సంప్రదాయం అంటే చాలా ఇష్టం. అక్కడి భోజనం, ఆహార పదార్థాలు చాలా రుచికరంగా ఉంటాయి. ఎప్పటికైనా తమిళవాసుల ఇంటి కోడలిని కావాలన్నదే నా కోరిక " అంటూ మదిలోని మాటను రష్మిక వెల్లడించింది. రష్మిక గతంలో కన్నడ హీరో రక్షిత్‌ శెట్టితో ప్రేమాయణం నడిపి నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, ఆ పెళ్లి ఎందుకో జరగలేదు.

రష్మిక

ప్రస్తుతం ఈమె తెలుగులో అల్లు అర్జున్‌తో కలిసి 'పుష్ప' సినిమాలో నటిస్తోంది. శర్వానంద్‌ నటిస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు'లోనూ హీరోయిన్​గా చేస్తోంది. బాలీవుడ్‌లో సిద్ధార్థ మల్హోత్రా సరసన 'మిషన్‌ మజ్ను'తో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'గుడ్‌బై' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details