తెలంగాణ

telangana

ఏ డైరెక్టర్​కు నేను అలా చెప్పలేను: హీరో రామ్​చరణ్

By

Published : Dec 29, 2021, 7:31 PM IST

Ram charan Bollywood: 'జంజీర్' తర్వాత బాలీవుడ్​లో సినిమాలు చేయకపోవడం గురించి రామ్​చరణ్ మాట్లాడారు. పాన్ ఇండియా చిత్రాల గురింతి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ram charan news
రామ్​చరణ్

Ram charan RRR: నటులు దర్శకులను ఎంపిక చేయడం కాదు.. దర్శకులే నటులను ఎంపిక చేయాలని హీరో రామ్​చరణ్ అన్నారు. 2013లో 'జంజీర్'తో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కథానాయకుడు.. ఆ తర్వాత అక్కడ సినిమాలు చేయలేదు. అయితే హిందీలో మళ్లీ ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు. 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్​లో భాగంగా దీనితో పాటు పలు విషయాల్ని వెల్లడించారు.

ఆర్ఆర్​ఆర్ సినిమాలో రామ్​చరణ్

"నేను చూసిన దాని ప్రకారం నటులు దర్శకులను కాదు.. దర్శకులే నటులను ఎంపిక చేయాలి.'పద సినిమా చేద్దాం' అని ఏ డైరెక్టర్​కు చెప్పలేను. అది వర్కౌట్​ కూడా కాదు. డైరెక్టర్లు స్వయంగా కథ సిద్ధం చేసి, అందులోని పాత్రకు నేను సరిపోతాను అనిపించి నటిస్తేనే బాగుంటుంది" అని చరణ్ అన్నారు.

అయితే నటులు అడిగారు కదా అని దర్శకులు కథ రాసి, సినిమా తీస్తే మాత్రం రిజల్ట్ అల్లకల్లోలం అయిపోతుందని చరణ్ చెప్పారు. ప్రస్తుత సోషల్ మీడియా, ఓటీటీ యుగంలో నటుల ప్రతిభను దర్శకులు గుర్తిస్తున్నారని, అందుకు తగ్గ స్టోరీలు రాసుకొస్తున్నారని పేర్కొన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్​చరణ్

Ram charan movies: 'చిరుత' సినిమాతో హీరోగా కెరీర్​ ప్రారంభించిన రామ్​చరణ్.. 'మగధీర'తో ఇండస్ట్రీ హిట్​ కొట్టారు. తనకు హిట్​ ఇచ్చిన రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' చేశారు. ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఇదే సినిమాలో అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ కూడా కొమరం భీమ్​ పాత్రలో కనిపించనున్నారు.

ప్రస్తుత కాలంలో ప్రతిదీ పాన్ ఇండియా అయిపోయిందని, 'బాహుబలి' ఫ్రాంచైజీతో దీనికి నాంది పలికిన రాజమౌళికి ఈ ఘనత దక్కుతుందని చరణ్ ప్రశంసించారు.

అల్లూరి సీతారామరాజు గెటప్​లో రామ్​చరణ్

"బాహుబలి' సినిమాతో బౌండరీలు చెరిగిపోయాయి. అంతకుముందు దక్షిణాది సినిమాలంటే చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడది పోయింది. ప్రస్తుతం దర్శకులు.. భాషతో సంబంధం లేకుండా నటుల్ని ఎంచుకుంటున్నారు. సోషల్ మీడియా, ఓటీటీ కూడా ఇందులో కీలక భూమిక పోషించింది. అలానే ఒకరి పని మరొకరు గమనిస్తున్నారు. ఆలియా బాలీవుడ్​ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడి నటీనటులు ఇతర భాషల్లో అవకాశాలు అందుకుంటున్నారు. ఇండియన్ సినిమాలో ఇది బెస్ట్ టైమ్. డైరెక్టర్స్​కు చాలా ఆప్సన్స్​ ఉన్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల నటీనటులతో సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు నటుడిగా ఉన్నందుకు గర్విస్తున్నాను" అని రామ్​చరణ్ చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details