తెలంగాణ

telangana

యూరప్​లో అందాల గోపికలతో ప్రభాస్​

By

Published : Jun 25, 2019, 2:15 PM IST

రెబల్​స్టార్​ ప్రభాస్​, శ్రద్ధాకపూర్​ జంటగా నటిస్తోన్న చిత్రం 'సాహో'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ యూరప్‌లో జరుగుతోంది. చిత్రీకరణ విరామ సమయంలో ప్రభాస్​... అందాల గోపికలను వెంటేసుకొని షాపింగ్​లు చేస్తున్న ఫొటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి.

యూరప్​లో అందాల గోపికలతో ప్రభాస్​

సుజీత్​ దర్శకత్వంలో ప్రభాస్​, శ్రద్ధాకపూర్​ హీరోహీరోయిన్లుగా 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఆస్ట్రియాలో చిత్రీకరణ జరుపుకొంటోంది. షూటింగ్‌ విరామ సమయంలో ప్రభాస్‌ లేడీ గ్యాంగ్‌ని వెంటేసుకొని షాపింగ్‌ చేస్తున్నాడు. ప్రభాస్‌- శ్రద్ధ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

సాహో బృందం

ఇప్పటికే విడుదలైన ‘సాహో’ ట్రైలర్స్, టీజర్స్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. యువీ క్రియేషన్స్‌ పతాకంపై భారీ బడ్జెట్​లో యాక్షన్​, ఎంటర్​టైన్​మెంట్​గా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌కి చెందిన నీల్‌ నితిన్‌ ముఖేష్, జాకీ ష్రాఫ్, ఎల్విన్‌ శర్మ, చుంకీ, తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

ABOUT THE AUTHOR

...view details