తెలంగాణ

telangana

నాకు ఎవరూ లేరు.. నేను ఒంటరినే: నిధి అగర్వాల్​

By

Published : Mar 1, 2021, 3:51 PM IST

కాల్​ చేయడానికి.. మెసేజ్​లు పంపడానికి తనకెవరూ లేరని, సింగిల్​గానే ఉన్నట్లు తెలిపింది హీరోయిన్​ నిధి అగర్వాల్​. ఈ ముద్దుగుమ్మ ఎవరితోనో డేటింగ్​లో ఉన్నారంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు.

nidhi
నిధి అగర్వాల్​

తెలుగులో 'సవ్యసాచి' చిత్రంతో కథానాయికగా ప్రవేశించిన అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. ఆ తర్వాత మిస్టర్‌ మజ్ను, ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రాల్లో నటించారు. తాజాగా ఆమె ఎవరితోనో డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తోన్న వార్తలపై ఆమె స్పందించారు.

"కాల్‌ చేయడానికి.. మెసేజ్‌లు పంపడానికి నాకెవరూ లేరు. కొన్నిసార్లు నేనే ఖాళీగా కూర్చోని ఫోన్లలో ఇతరులను చూస్తుంటా. కొన్ని సందర్భాల్లో నడుస్తూనే మా మేనేజర్‌కు మెసేజ్‌లు చేస్తుంటా. నేను స్నేహితులతో కలిసి బయటకు విందుకు వెళ్లాలనుకున్నా చాలా జాగ్రత్తలు తీసుకుంటా. ఎక్కడికి వెళ్లాలనేది స్నేహితుల ఇష్టానికే వదిలేస్తా. ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నా. ఈ ప్రయాణం నాన్‌స్టాప్‌గా సాగిపోతోంది. ఒంటరిగా నా ప్రయాణం బాగుంది.. ఎవరైనా జీవితంలోకి వచ్చినా బాగానే ఉంటుంది." అంటూ తెలిపింది.

ఈ మధ్యే తమిళనాడులో నిధి అగర్వాల్‌కు విగ్రహం చేయించి, దానికి పాలాభిషేకాలు కూడా చేశారు అక్కడి అభిమానులు. తమిళంలో భూమి, ఈశ్వరన్‌ సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకుల అభిమానం సంపాదించింది. ప్రస్తుతం తెలుగులో పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

ఇదీ చూడండి: నిధి అగర్వాల్​కు గుడి కట్టిన అభిమానులు

ABOUT THE AUTHOR

...view details