తెలంగాణ

telangana

దేశభక్తిని రగిల్చిన 75 అద్భుత దృశ్య కావ్యాలివే!

By

Published : Aug 28, 2021, 5:32 AM IST

'ఆజాది కా అమృత్' మహోత్సవాన్ని పురస్కరించుకుని చిత్రాంజలి@75 అనే ఈ-ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించింది కేంద్రం. దీనిలో భాగంగా ప్రజల్లో దేశభక్తిని నింపి.. స్ఫూర్తిని కలిగించిన 75 సినిమాల జాబితాను విడుదల చేసింది.

75 అద్భుత దృశ్య కావ్యాలివే!
75 అద్భుత దృశ్య కావ్యాలివే!

భారతీయ సినీ చరిత్రలో దేశభక్తిని రగిల్చిన అద్భుత చిత్రాల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌.ఎఫ్‌.డి.సి) 75 ఉత్తమ భారతీయ చిత్రాల్ని ఎంపిక చేసింది. ఆజాదీ కా అమృత్​లో భాగంగా దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రాలివి. సంబంధిత పోస్టర్‌ను కేంద్ర మంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, కిషన్‌ రెడ్డి, ఎల్‌.మురుగన్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, మీనాక్షి లేఖిలు విడుదల చేశారు.

దేశభక్తిని రగిల్చిన 75 అద్భుత దృశ్య కావ్యాలివే!

ఈ చిత్రాల్లో అత్యధికంగా బాలీవుడ్‌ నుంచే ఉన్నాయి. 'లగాన్‌', 'బోర్డర్‌', 'భగత్‌సింగ్‌', 'గాంధీ' తదితర ఉత్తరాది సినిమాల సరసన దక్షిణాది చిత్రాలు 'రోజా', 'సైరా', 'కాలాపానీ', 'హే రామ్‌' చిత్రాలు ఉన్నాయి. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు 'ఐకానిక్‌ వీక్‌'గా ఈ వేడుక సాగుతుంది.

ABOUT THE AUTHOR

...view details