తెలంగాణ

telangana

వ్యవసాయ చట్టాల రద్దు.. సినీ ప్రముఖులు ఏమన్నారంటే?

By

Published : Nov 19, 2021, 2:16 PM IST

వ్యవసాయ చట్టాలు రద్దు(farmer laws) చేయడంపై బాలీవుడ్​కు చెందిన పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

tapsee kangana ranaut
తాప్సీ- కంగనా రనౌత్

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను(farmer laws) రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ(pm modi news) శుక్రవారం చేసిన ప్రకటన దేశ ప్రజలను ఆశ్చర్యపర్చింది. ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాలతో పాటు సినీరంగ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరి విజయమంటూ సోషల్​ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నటి తాప్సీ పన్ను ఈ ప్రకటనను ఉద్దేశిస్తూ.. అందరికీ గురు నానక్‌ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇదొక అద్భుతమైన విషయం! సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. శాంతియుత నిరసనల ద్వారా తమ డిమాండ్లను పరిష్కరించుకొన్న అన్నదాతలకు అభినందనలు. ఈ ప్రకాశ్ దివస్‌ రోజున మీ కుటుంబాల చెంతకు సంతోషంగా తిరిగి వెళ్తారని ఆశిస్తున్నాను. -బాలీవుడ్ నటుడు సోనూసూద్‌(sonu sood news)

ఎన్నో ప్రాణాలు గాల్లో కలిశాయి. భారీ మూల్యం చెల్లించారు. చివరకు తమ డిమాండ్లను శాంతియుతంగా సాధించుకున్నందుకు గర్వపడుతున్నాను. జై కిసాన్.. జై హింద్‌. -శృతి సేథ్‌

మీరు గెలిచారు.. మీ విజయం అందరిది. -నటి రిచా చద్దా

అంతిమంగా విజయం మీదే. రైతులందరికీ శుభాకాంక్షలు. గురునానక్ జయంతి సందర్భంగా దక్కిన గొప్ప బహుమతి. -హిమాన్షి ఖురానా

కంగన కామెంట్‌ ఏంటో తెలుసా?

స్ట్రీట్ పవర్‌ (వీధిపోరాటం) గొప్పదని నిరూపితమైందంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ షేర్‌ చేస్తూ కంగన(kangana ranaut news) కేంద్రం నిర్ణయంపై స్పందించారు. 'విచారకరం, అవమానకరం, అన్యాయం' అంటూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. 'పార్లమెంట్‌లో ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధిలో ఉన్న ప్రజలు చట్టాలు చేయడం ప్రారంభించినట్లయితే ఇది కూడా జిహాదీ దేశమే. ఇలా కోరుకునే వారందరికీ అభినందనలు' అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.

ఇది చదవండి:Farm laws India: సాగు చట్టాల రద్దు.. వ్యూహాత్మకమా? వెనక్కి తగ్గడమా?

ABOUT THE AUTHOR

...view details