తెలంగాణ

telangana

క్వారంటైన్​ వల్ల అమ్మను కలవలేకపోతున్నా: చిరంజీవి

By

Published : Jan 29, 2022, 12:00 PM IST

Updated : Jan 29, 2022, 12:30 PM IST

Chiranjeevi news: తల్లి అంజనాదేవీకి బర్త్​డే విషెస్ చెప్పిన చిరంజీవి.. క్వారంటైన్​ వల్ల ఆమెను కలవలేకపోతున్నామని ట్వీట్ చేశారు. మరు జన్మలకు ఆమె దీవెనలు కావాలని కోరుకుంటున్నానని రాసుకొచ్చారు.

chiranjeevi
చిరంజీవి

Chiranjeevi mother birthday: క్వారంటైన్‌లో ఉండటం వల్ల తన మాతృమూర్తి అంజనాదేవీని కలవలేకపోతున్నానని మెగాస్టార్‌ చిరంజీవి బాధపడ్డారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన.. ప్రస్తుతం హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. తన తల్లి పుట్టినరోజు శనివారం పురస్కరించుకుని సోషల్‌మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లి, సతీమణితో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విటర్ వేదికగా షేర్‌ చేశారు.

"అమ్మా.. నీకు జన్మదిన శుభాకాంక్షలు. క్వారంటైన్‌లో ఉన్న కారణంగా ప్రత్యక్షంగా కలుసుకొని నీ ఆశీస్సులు తీసుకోలేక ఇలా విషెస్‌ తెలుపుతున్నాను. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు.. మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. ప్రేమతో.. శంకరబాబు" అని చిరు తన ట్వీట్​లో పేర్కొన్నారు.

ఇందులో చిరు తన సొంతపేరు శివ శంకర వరప్రసాద్‌ (శంకరబాబు) ఉపయోగించడం వల్ల అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు. "అభిమానులందరికీ ఆయన మెగాస్టార్‌ లేదా చిరంజీవి కావొచ్చు. కానీ.. తన తల్లికి మాత్రం శంకరబాబునే కదా" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

Last Updated : Jan 29, 2022, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details