ETV Bharat / sitara

మెగాస్టార్​ సరసన త్రిష.. 16ఏళ్ల తర్వాత మళ్లీ..!

author img

By

Published : Jan 25, 2022, 10:04 AM IST

Megastar Chiranjeevi Movies: మెగాస్టార్​ చిరంజీవి సరసన నటించేందుకు త్రిష.. మరోసారి ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు చేస్తున్న సినిమాలో హీరోయిన్​గా త్రిషను ఎంపిక చేసినట్లు సమాచారం.

trisha to pair with megastar
మెగాస్టార్​ సరసన త్రిష

Megastar Chiranjeevi Movies: మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఆచార్య చిత్రం షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం 'గాడ్​ఫాదర్'​, 'భోళాశంకర్'​, 'వాల్తేరు వీర్రాజు' సినిమాల్లో నటిస్తున్నారు చిరు.

అయితే యంగ్​ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు మెగాస్టార్. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనుంది.

ఈ చిత్రంలో కథానాయికగా మొదట శ్రుతిహాసన్ పేరు వినిపించింది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్​గా త్రిష ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

త్రిష తొలిసారిగా 'స్టాలిన్​' చిత్రంలో మెగాస్టార్​ సరసన నటించారు. ఈ చిత్రం 2006లో విడుదలైంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: 'అనగనగా ఒక రాజు'లో రాణి ఎవరంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.