తెలంగాణ

telangana

ప్రేమికుల రోజున 'సర్కారు వారి పాట' సందడి

By

Published : Jan 26, 2022, 6:33 AM IST

Updated : Jan 26, 2022, 9:16 AM IST

Sarkaru vaari paata songs: మహేశ్​ 'సర్కారు వారి పాట' సినిమాలోని తొలి గీతం వాలంటైన్స్​ డే రోజు విడుదల కానుంది. ఈ సినిమా ఏప్రిల్​లో థియేటర్లలోకి రానుంది.

mahesh babu sarkaru vaari paata
మహేశ్​బాబు సర్కారు వారి పాట మూవీ

Mahesh babu new movie: విడుదలకు కొన్ని నెలల ముందు నుంచే సినిమాల పాటలు సందడి చేయడం ఇటీవల ఓ ట్రెండ్‌గా మారింది. పాటలు ఎంత బలంగా ప్రేక్షకుల్లోకి వెళితే సినిమాపై అంతగా ఆసక్తి ఏర్పడుతుందని చిత్రవర్గాలు నమ్ముతున్నాయి. అందుకే నెలల ముందే హంగామా మొదలవుతోంది. ఈ క్రమంలోనే త్వరలో 'సర్కారు వారి పాట' సందడి కూడా షురూ కానుంది.

.

మహేశ్​బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తీస్తున్న చిత్రమిది. కీర్తిసురేశ్ కథానాయిక. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. ఈ సినిమాలోని తొలి పాటను ప్రేమికుల రోజున విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని బుధవారం ప్రకటించడం సహా పోస్టర్​ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తమన్‌ స్వరాలు సమకూర్చుతున్నారు.

మహేశ్​ సర్కారు వారి పాట మూవీ
Last Updated : Jan 26, 2022, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details