ETV Bharat / sitara

ఆర్జీవీ కోసం రిస్క్​ చేశా.. ఆయన చీట్​ చేశారు!: నటి

author img

By

Published : Jan 25, 2022, 7:34 PM IST

దర్శకుడు రామ్​ గోపాల్​ వర్మ కోసం తాను ఓ రిస్క్​ చేసినట్లు గుర్తుచేసుకుంది నటి మహేశ్వరి. ఆయన తనకు రూ.50 వేలు బాకీ ఉన్నారని, ఇప్పటికీ దాన్ని తీర్చలేదని చెప్పింది! 'ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆమె ఈ విషయంతో పాటు తన కెరీర్​ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపింది.

maheswari
మహేశ్వరి

'గులాబి' సినిమాతో కుర్రకారులో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది నటి మహేశ్వరి. ఆ తర్వాత ఎక్కువ సినిమాల్లో నటించకపోయినా.. అందరి మనసులో ఆమె అపురూప సౌందర్యం, అభినయం ఇప్పటికీ అలాగే దాగి ఉంది. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఈమె ఈ సినిమా షూటింగ్​లో జరిగిన ఆసక్తికర సంఘటలను తెలిపింది. అలానే ఈ చిత్రాన్ని నిర్మించిన రామ్​గోపాల్​ వర్మ తనకు రూ.50 వేలు బాకీ ఉన్నారని వెల్లడించింది.

maheswari
'అలీతో సరాదాగా' షోలో మహేశ్వరి

"'దెయ్యం' సినిమా షూటింగ్​.. మేడ్చల్​లోని వర్మ ఫామ్​హౌస్​​లో జరిగింది. మెయిన్​ రోడ్​ నుంచి అక్కడికి 2కి.మీల దూరం ఉంటుంది. శ్మశానం సెట్​ వేశారు. ఉదయం ఒంటి గంటకు షూటింగ్​ జరుగుతోంది. అప్పుడు వర్మకు బోర్ కొట్టినట్టు ఉంది.. 'ఎవరైనా మెయిన్​ రోడ్డు వరకు వెళ్లొస్తారా.. ఒంటిరిగా?' అని అడిగారు. సెట్​ చూస్తే అందరికీ భయమేసేది. ఇక మెయిన్​ రోడ్​కు వెళ్లాలంటే చుట్టూ పొడవాటి చెట్లతో చాలా భయంకరంగా ఉంటుంది. ఎవ్వరూ స్పందించక పోయే సరికి రూ.50 వేలు ఇస్తానని వర్మ అన్నారు. దీంతో 'నేను వెళ్తా' అని చెప్పాను. కానీ లోపల చాలా భయమేసింది. అయినా వెళ్లి వచ్చాను. కానీ ఇంకా ఆయన డబ్బులు ఇవ్వలేదు."

-మహేశ్వరి, నటి

బతికి బయటపడితే చాలనుకున్నా..

ఇక ఈ సినిమాలో 'మేఘాలలో తేలిపొమ్మనది..' అనే పాట వింటే ఇప్పటికీ హుషారు వచ్చేస్తుంది. అయితే ఆ సాంగ్​ షూటింగ్​ సమయంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు గుర్తుచేసుకుంది మహేశ్వరి. "నాకు అస్సలే బైకు మీద వెళ్లటం అలవాటు లేదు. ఆ సాంగ్​ మొత్తం బైకులో ఫాస్ట్​గా వెళ్లాలి. అరకులో షూటింగ్​ చేస్తున్నప్పుడు వ్యాన్​ అడ్డు రావడం వల్ల మా బైక్ లోయలో పడిపోయింది. లక్కీగా అది 10 అడుగులు మాత్రమే ఉంది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక అంతే. అక్కడ చెట్టు ఏదో ఉంది. అక్కడే హీరో జేడీ చక్రవర్తి బండి ఆపేశాడు. ఆ క్షణంలో బతికి బయటపడితే చాలనుకున్నా." అని తెలిపింది.

maheswari
మహేశ్వరి

గట్టిగా అరిచేది..

ఇక హీరో జేడీ చక్రవర్తి ఈ షోలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొని కాసేపు సందడి చేశారు. ఇందులో భాగంగా.. "మహేశ్వరికి చాలా మొహమాటం. షూటింగ్​ చేస్తున్నప్పుడు మినహా తల పైకెత్తదు. నాకు బైకులంటే ప్రాణం. 'మేఘాలలో..' షూట్​లో ఉన్నప్పుడు.. నా బైకు ఎక్కిన తర్వాత.. 'ఇదే నేను తొలిసారి బైకు ఎక్కడం' అని నాతో చెప్పింది. సాంగ్​ కోసం స్పీడ్​గా​ వెళ్తుంటే వెనకాల నుంచి గట్టిగా అరిచేది" అని గుర్తుచేసుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: రామ్​గోపాల్ వర్మ చెంప పగలగొట్టిన నటి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.