తెలంగాణ

telangana

చీపురు పట్టి అమ్మకు సాయం చేసిన సితార

By

Published : Jun 6, 2020, 3:29 PM IST

హీరో మహేశ్​ తనయ సితార.. చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తున్న వీడియోను ఇన్​స్టాలో పోస్ట్​ చేసింది. ఈ వీడియోకు నెట్టింట్లో విశేష స్పందన లభిస్తోంది.

sitara
సితార

సూపర్​స్టార్ మహేశ్​బాబు కుమార్తె సితార.. నాన్నతో కలిసి అల్లరే కాకుండా అమ్మకు సాయం చేయడమూ తెలుసని చెబుతోంది. ఇటీవలే తమ ఇంటిలోపలి భాగాన్ని చీపురుతో శుభ్రం చేస్తూ కనిపించింది. అందుకు సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంది.

"ఈరోజు అమ్మకు సాయం చేద్దాం. ఇంటిని శ్రుభ్రం చేయడం నిజంగా చాలా ఫన్‌గా ఉంటుంది. అమ్మకు సాయం చేయడానికి నా దగ్గర చాలా సమయం ఉంది. వచ్చే వారం మరొక టాస్క్‌తో కలుద్దాం. అన్నట్టు నేను మంచి అమ్మాయినని అనుకుంటున్నా. మీ క్వారంటైన్‌ స్టోరీస్‌ ఏమైనా ఉంటే నాతో పంచుకోండి" అంటూ వీడియో దిగువన సితార రాసుకొచ్చింది.

ఘట్టమనేని అమ్మాయి చాలా గడుసు పిల్లేనంటూ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది 'సో క్యూట్' సితార పాప అంటూ రాసుకొస్తున్నారు.

ఇది చూడండి : మౌనం వీడాలి.. జాత్యాహంకారానికి ముగింపు పలకాలి

ABOUT THE AUTHOR

...view details