తెలంగాణ

telangana

నాగార్జునతో 'జాతిరత్నాలు' బ్యూటీ స్పెషల్ సాంగ్!

By

Published : Nov 19, 2021, 12:22 PM IST

'బంగార్రాజు' సినిమా గురించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. యువనటి ఫరియా అబ్దుల్లా.. నాగ్​తో కలిసి స్పెషల్ సాంగ్​ చేయనుందట.

faria abdullah in bangarraju movie
నాగార్జున ఫరియా అబ్దుల్లా

కింగ్ నాగార్జున 'బంగార్రాజు' షూటింగ్ ఫుల్ స్వింగ్​లో జరుగుతుంది. ఇటీవల నాగలక్ష్మి పాత్ర ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్​లో కనిపించిన కృతిశెట్టి.. ఆకట్టుకుంటోంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం ఆసక్తి కలిగిస్తోంది.

బంగార్రాజు సినిమాలో కృతిశెట్టి

ఈ సినమాలో ఓ స్పెషల్ సాంగ్​ ఉందని, అందుకోసం 'జాతిరత్నాలు' ఫేమ్​ ఫరియా అబ్దుల్లాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె.. నాగ్ సర్​కు ప్రత్యేకమైన స్వాగ్ ఉంటుందని, ఆయనతో డ్యాన్స్​ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది.

'సోగ్గాడే చిన్ని నాయనా'కు ఈ సినిమా ప్రీక్వెల్​గా తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జున, రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన కల్యాణ్​కృష్ణ కురసాల.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.

ఫరియా అబ్దుల్లా

అయితే 'బంగార్రాజు'ను సంక్రాంతి రేసులో నిలబెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. కానీ 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయక్', 'రాధేశ్యామ్' లాంటి భారీ సినిమాలు ఇప్పటికే బరిలో ఉన్న నేపథ్యంలో.. 'బంగార్రాజు'కు ప్లేస్ దొరుకుతుందా అనేది చూడాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details