తెలంగాణ

telangana

"వైల్డ్​ డాగ్'​ రిలీజ్​ తర్వాత మరిన్ని ఛాన్సులొస్తాయి'

By

Published : Mar 30, 2021, 4:59 PM IST

Updated : Mar 30, 2021, 5:08 PM IST

కింగ్​ నాగార్జున ప్రధానపాత్రలో నటించిన 'వైల్డ్​ డాగ్'​ చిత్రం.. ఏప్రిల్​ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో నాగ్​ భార్య పాత్ర పోషించిన బాలీవుడ్​ నటి దియా మీర్జా.. తెలుగు సినిమా నటించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలను ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Dia Mirza interview
దియా మీర్జా

దేశం కోసం పోరాడుతున్న పోలీసు అధికారి భార్య పాత్రలో నటించడం ఎంతో గర్వంగా ఉందని ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా అన్నారు. తెలుగులో తొలిసారిగా అక్కినేని నాగార్జునతో కలిసి 'వైల్డ్​డాగ్' చిత్రంలో ఆమె నటించారు. ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఈటీవీ భారత్​తో దియా మీర్జా ప్రత్యేకంగా ముచ్చటించారు.

దియా మీర్జా ఇంటర్వ్యూ

ప్రియావర్మ పాత్ర ఎంతో మంది వీర జవాన్ల కుటుంబాల్లోని మహిళలకు ప్రతిబింబంగా ఉంటుందని ఆమె తెలిపారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగార్జునను చూడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్న దియా మీర్జా.. నాగ్​తో కలిసి నటించడం చెప్పలేని అనుభూతిని మిగిల్చిందన్నారు. చిత్ర కథలో తన పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు.

'వైల్డ్ ​డాగ్' విడుదల తర్వాత తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు దియా. తన స్వస్థలమైన హైదరాబాద్​కు వచ్చి తెలుగు సినిమా చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. అలాగే ఇటీవల జాతీయ ఉత్తమ నటిగా పురస్కారానికి ఎంపికైన కథానాయిక కంగనా రనౌత్​కు ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఇదీ చూడండి:రోడ్డు ప్రమాదంలో ప్రముఖ గాయకుడు మృతి

Last Updated : Mar 30, 2021, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details