తెలంగాణ

telangana

బాలకృష్ణ-బోయపాటి సినిమా టైటిల్ ఉగాదికి?

By

Published : Apr 9, 2021, 9:39 PM IST

విడుదలకు దగ్గరపడుతున్నా సరే బాలకృష్ణ సినిమా టైటిల్​ ఇంకా వెల్లడించలేదు. అయితే దానిని ఉగాది రోజున ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

balakrishna boyapati movie name on ugadi
ఉగాదికి బాలకృష్ణ-బోయపాటి సినిమా టైటిల్?

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై 'బీబీ3' వర్కింగ్‌ టైటిల్‌గా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్​ను ఉగాది రోజున ప్రకటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన టైటిల్‌పై సామాజిక మాధ్యమాల్లో రెండు మూడు పేర్లు బయటకు వచ్చాయి. వాటిలో ఒకదానిని ఖరారు చేస్తారా? లేదా వేరే టైటిల్స్ పెడతారా? అనే విషయం తెలియాలంటే ఉగాది వరకు వేచి చూడాల్సిందే. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటిస్తోంది. పూర్ణ వైద్యురాలి పాత్రలో కనిపించనుందట. శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్నారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. మే 28న థియేటర్లలోకి ఈ సినిమాను తీసుకురానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details