తెలంగాణ

telangana

అనసూయ కొత్త సినిమా నేరుగా ఓటీటీలో

By

Published : Apr 26, 2021, 12:26 PM IST

అనసూయ, విరాజ్ అశ్విన్, మోనిక తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'థాంక్యూ బ్రదర్' ఓటీటీలో విడుదల కానుంది. ఇందులో అనసూయ గర్భిణిగా నటించింది.

Anasuya's 'Thank you brother' movie goes the OTT way
అనసూయ కొత్త సినిమా నేరుగా ఓటీటీలో

ఈ మధ్య కాలంలో విడుదల కావాల్సిన సినిమాలన్నీ కరోనా ప్రభావం, థియేటర్ల మూసివేత కారణంగా వాయిదా పడుతున్నాయి. వాటి కొత్త రిలీజ్​ తేదీలపైనా సందిగ్ధత ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది అనసూయ 'థాంక్యూ బ్రదర్'.

'థాంక్యూ బ్రదర్' మూవీ

ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా.. 'ఆహా'లో ఇప్పుడు మే 7 నుంచి స్ట్రీమింగ్​ కానుంది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ప్రకటించడం సహా పోస్టర్​ను విడుదల చేశారు.

లిఫ్ట్​లో ఇరుక్కుపోయిన ఓ గర్భిణి, యువకుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. అందులో నుంచి ఎలా బయటపడ్డారు? అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. రమేశ్ రాపర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఇది చదవండి:ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్' విజేతల పూర్తి జాబితా

ABOUT THE AUTHOR

...view details