తెలంగాణ

telangana

'కలల్ని నిజం చేసుకోవాలంటే కష్టపడాల్సిందే'

By

Published : May 13, 2021, 6:30 AM IST

దంత వైద్యురాలిగా చదువు కొనసాగిస్తూనే నటిగానూ సత్తాచాటుతోంది మీనాక్షి చౌదరి. ఇలా ఒకేసారి రెండు విషయాలపై దృష్టిపెట్టడం కష్టమే అయినా నచ్చిన కలల్ని నిజం చేసుకోవడానికి ఆ మాత్రం కష్టపడక తప్పదని తెలిపింది.

Meenakshi Chowdary
మీనాక్షి చౌదరి

"చిత్రసీమలోకి వచ్చి, నన్ను నేను నిరూపించుకునే క్రమంలో బయట వ్యక్తుల్లాగే చిన్న చిన్న కష్టాలు ఎదుర్కొన్నా. అంతేకానీ, కాస్టింగ్‌ కౌచ్‌ సమస్యను ఎన్నడూ ఎదుర్కోలేదు. దేవుడి దయవల్ల నాకిప్పటి వరకు వచ్చిన ప్రాజెక్టుల వల్ల ఎంతో మంది మంచి వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని" అంటోంది నటి మీనాక్షీ చౌదరి.

ఓ వైపు దంత వైద్యురాలిగా చదువు కొనసాగిస్తూనే.. నటిగానూ సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఒకేసారి రెండు విషయాలపై దృష్టి పెట్టడం కాస్త కష్టమే అయినా.. మనసుకు నచ్చిన రెండు కలల్ని నిజం చేసుకోవడానికి ఆ మాత్రం కష్టపడక తప్పదంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మీనాక్షి.. వ్యక్తిగత, సినీ కెరీర్‌లకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

"ఆర్మీ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని నేను. కాబట్టే క్రమశిక్షణగా ఎలా ఉండాలి.. బాధ్యతగా ఎలా పనిచేయాలి? సమయ పాలన విషయంలోనూ ఎంతో కచ్చితంగా వ్యవహరిస్తుంటా. కథ బాగుండి.. అందులో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఏ భాషలో నటించడానికైనా సిద్ధమే. ప్రస్తుతం తెలుగులో నేను చేస్తున్న 'ఖిలాడీ' చిత్రం నాకెంతో ప్రత్యేకం. నేను రవితేజకి చాలా పెద్ద అభిమానిని" అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం మీనాక్షి తెలుగులో 'ఖిలాడీ'తో పాటు అక్కినేని సుశాంత్‌తో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే సినిమా చేస్తోంది. తమిళంలో ఓ కొత్త చిత్రానికి సంతకాలు చేసినట్లు తెలియజేసింది.

ABOUT THE AUTHOR

...view details