తెలంగాణ

telangana

టుస్సాడ్స్​ మ్యూజియంలో కాజల్ మైనపు విగ్రహం​

By

Published : Dec 17, 2019, 3:25 PM IST

ప్రముఖ నటి కాజల్ అగర్వాల్​కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్​లోని మేడమ్​ టుస్సాడ్స్​ మ్యూజియంలో కాజల్​ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

actress kajal aggarwal Statue of wax at madame tussauds mussium
టుస్సాడ్స్​ మ్యూజియంలో కాజల్​

సినీ, రాజకీయ, క్రీడా రంగంలోని ప్రముఖలు మైనపు విగ్రహాలను సింగపూర్​లోని మేడమ్​ టుస్సాడ్స్​​ మ్యూజియంలో ఏర్పాటు చేయడం తెలిసిన సంగతే. గతంలో టాలీవుడ్ స్టార్స్​ ప్రభాస్​, మహేశ్​బాబులకు ఈ అరుదైన గౌరవం దక్కింది.తాజాగా ప్రముఖ నటి కాజల్​ అగర్వాల్ ఈ జాబితాలో చేరింది.

కాజల్​ మైనపు విగ్రహాన్ని సింగపూర్​ మేడమ్​ టుస్సాడ్స్​ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. 2020 ఫిబ్రవరి 5న హీరోయిన్ చేతులమీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ అరుదైన అవకాశం అందుకున్న కాజల్.. ఇన్​స్టా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది.

"టుస్సాడ్స్‌ మ్యూజియంలో నా విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఫిబ్రవరి 5న మీ అందరికి పరిచయం చేస్తా."

కాజల్​ అగర్వాల్​, సినీ నటి

ఈ గౌరవం దక్కించుకున్న తొలి దక్షిణాది కథానాయిక కాజల్‌ కావడం విశేషం.

ఇదీ చూడండి: బాబాయ్ పవర్​స్టార్​ నిర్మాణంలో చెర్రీ

ABOUT THE AUTHOR

...view details