తెలంగాణ

telangana

X New Subscription Fee : ట్విట్టర్​ యూజర్లకు షాక్​.. ఏం చేయాలన్నా డబ్బులు కట్టాల్సిందే.. ఎంతంటే?

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 12:13 PM IST

X New Subscription Fee : నకిలీ ఖాతాలను అరికట్టడమే లక్ష్యంగా సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో ఎలాన్‌ మస్క్‌ మరో సరికొత్త సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను తీసుకొచ్చారు. అదేంటంటే..

X New Subscription fee
Twitter New Subscription price

X New Subscription Fee :బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలోని సామాజిక మాధ్యమం 'ఎక్స్‌' (గతంలో ట్విటర్‌) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను పరీక్షించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి దీన్ని ప్రయోగాత్మకంగా కొన్ని మార్కెట్లలో ప్రవేశపెట్టింది. న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌లో ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్‌ పాలసీ అందుబాటులోకి వచ్చింది

ఏంటీ కొత్త సబ్‌స్క్రిప్షన్‌..
X Subscription Cost :ఈ సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ ప్రకారం.. కొత్తగా ఎక్స్‌ (X) ఖాతా తెరిచే యూజర్లు ఏడాదికి 1 డాలర్‌ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వెబ్‌వెర్షన్‌లో ఇతరుల సందేశాలను రీపోస్ట్‌ చేయడం, లైక్ చేయడం, బుక్‌మార్క్‌ చేయడం, ఇతరుల ఖాతాలను మెన్షన్‌ చేయడం లాంటి బేసిక్‌ ఫీచర్లు కావాలనుకునే వారు మాత్రమే ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఖాతా తెరిచి పోస్ట్‌లను చదవడం, ఫొటోలు, వీడియోలు చూడ్డానికి మాత్రం ఎలాంటి రుసుము అవసరం లేదు. ప్రస్తుతానికి దీన్ని కొత్త యూజర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించిదంది. ఇప్పటికే ఎక్స్‌ ఖాతా ఉన్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే 'ఎక్స్‌ ప్రీమియం' పేరిట ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఎక్స్‌ అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. దీని వల్ల యూజర్లు తమ ట్వీట్లను ఎడిట్‌ చేయవచ్చు. సుదీర్ఘ సందేశాలను పోస్ట్‌ చేయగలుగుతారు. అలాగే ఫోల్డర్స్​ను​ బుక్‌ మార్క్‌ కూడా చేసుకోగలుగుతారు. మరీ ముఖ్యంగా యాప్‌ ఐకాన్‌ను నచ్చినట్లుగా మార్చుకోవడం లాంటి అదనపు ఫీచర్లను కూడా పొందవచ్చు.

నకిలీల బెడద!
'ఎక్స్‌ (X)'లో నకిలీ ఖాతాల బెడదపై మస్క్‌ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఖాతాలను అరికట్టడం కోసం ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. తాజాగా తీసుకొస్తున్న 1 డాలర్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా అందులో భాగమేనని కంపెనీ వివరించింది. దీని వల్ల నకిలీ ఖాతాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ట్విట్టర్​ సబ్‌స్క్రిప్షన్‌ ఛార్జీలు ఆయా దేశాలను అనుసరించి మారుతూ ఉంటాయి.

Oppo Find N3 Flip Review : ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్.. రివ్యూ అదిరింది.. ఫీచర్లు మామూలుగా లేవు.!

Top 10 WhatsApp Features : వాట్సాప్​ లాంఛ్​ చేసిన టాప్​ 10 ఫీచర్స్​​ ఇవే.. మీరు వాడుతున్నారా?

ABOUT THE AUTHOR

...view details