తెలంగాణ

telangana

చైనా యాప్​లకు ఇవి ప్రత్యామ్నాయం.. ట్రై చేయండి!

By

Published : Jun 30, 2020, 11:04 AM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

గల్వాన్‌ ఘటనతో చైనా వస్తువుల బహిష్కరణతో పాటు ఆ దేశ సామాజిక మాధ్యమాలను కూడా భారతీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా టిక్​టాక్​ సహా 59 చైనా యాప్​లపై నిషేధం విధించింది భారత ప్రభుత్వం. అయితే ఆ యాప్​లకు స్వదేశీ, మిగతా దేశాల యాప్​లు ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. వాటి వివరాలపై ఓ లుక్కేయండి.

alternate apps to china apps
చైనా యాప్​లకు ప్రత్యామ్నాయం చూస్తున్నారా.. ఇవి ట్రై చేయండి

సరిహద్దులోని గల్వాన్‌ వద్ద భీకర ఘర్షణ తర్వాత దేశంలో చైనా తీరు పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా కేంద్రం చైనా కంపెనీలకు గట్టి షాక్‌ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన పలు యాప్‌లపై కొరడా ఝళిపించింది. దేశ భద్రత దృష్ట్యా టిక్‌టాక్‌ సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అలాంటి యాప్‌లకు ప్రత్యామ్నాయం ఏంటి? అన్‌ ఇన్‌స్టాల్‌ చేసిన ఈ యాప్స్‌ చేసే పనులు వేరే ఏయే యాప్స్‌తో చేసుకోవచ్చు? తదితర ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..

లాక్‌ వేయాలంటే...

ఫొటోలు, వీడియోలు, యాప్స్‌ ఇతరులకు కనిపించకుండా ఉండేందుకు వీటిని వాడుతుంటారు. ఇలాంటి యాప్స్‌లో మొదటి వరుసలో ఉండేవి యాప్‌లాక్‌.. వాల్ట్‌. వీటికి బదులుగా లాక్‌ యాప్‌ - స్మార్ట్‌ యాప్‌ లాకర్, లాక్‌ యాప్‌ - ఫింగర్‌ప్రింట్‌, కీప్‌ సేఫ్‌, నొర్టన్‌ యాప్‌ లాక్‌, లాక్‌ మై పిక్స్‌ సీక్రెట్‌ ఫొటో వాల్ట్‌ తదితర యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.

లాక్‌ వేయాలంటే...

బ్రౌజింగ్ ఇలా...

వార్తలు, ఫొటోలు, వీడియోలు... ఇలా ఏది కావాలన్న అంతర్జాలంలో వెతుకుతుంటాం. చాలా మొబైల్స్‌లో యూసీ బ్రౌజర్‌ను డీఫాల్ట్‌ ఇవ్వడం, సూచించడం లాంటివి చేస్తుండటం వల్ల అదే ఎక్కువగా వాడుతున్నారు. ఒకవేళ ఇది డిలీట్‌ చేసేస్తే... ఎలా అనుకోనక్కర్లేదు. గూగుల్‌ క్రోమ్‌, ఒపేరా, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ లాంటి బ్రౌజర్లు ట్రై చేయొచ్చు.

బ్రౌజింగ్ ఇలా...

స్కాన్‌ చేయాలంటే...

డాక్యూమెంట్లు, ఫొటోలను సులభంగా మొబైల్‌తోనే స్కాన్ చేయగలుతున్నాం. ఇందుకోసం చాలా మంది క్యామ్‌ స్కానర్‌ యాప్‌ను వాడుతున్నారు. ఇది అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తే దీనికి ప్రత్యామ్నయంగా అడొబ్‌ స్కాన్‌, మైక్రోసాఫ్ట్‌ లెన్స్‌, ఫొటో స్కాన్‌ బై గూగుల్‌ లాంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొవచ్చు. వీటితోపాటు భారత్‌లో రూపొందించిన డాక్ స్కానర్‌-పీడీఎఫ్‌ క్రియేటర్‌, డాక్యూమెంట్‌ స్కానర్‌-పీడీఎఫ్‌ క్రియేటర్‌ను ప్రయత్నించొచ్చు.

స్కాన్‌ చేయాలంటే...

ఫొటోలు మరింత ముచ్చటగా...

ఫొటోలను అందంగా మెరుగుపర్చడం, అదనపు హంగులు అద్దడం కోసం యువత ఎక్కువగా యూక్యామ్‌, బ్యూటీక్యామ్‌, బ్యూటీ ప్లస్‌ యాప్‌లను వాడుతున్నారు. వీటి స్థానంలో పిక్స్‌ ఆర్ట్‌, అడొబ్‌ ఫొటోషాప్‌, లైట్‌ రూమ్‌, గూగుల్‌ స్నాప్‌సీడ్‌, బీ612 యాప్స్‌ను ప్రయత్నించి చూడండి.

ఫొటోలు మరింత ముచ్చటగా...

మీరే ఎడిటర్‌...

వీడియోలను సులభంగా, వేగంగా ఎడిట్‌ చేయడానికి, ఆడియోను జోడించడానికి వైవా వీడియో, వైవా కట్‌, ఫిల్మోరా వంటి యాప్స్‌ను వాడుతున్నారు. వీటిని అన్‌ఇన్‌స్టాల్‌ చేసి ఉంటే... కైన్‌ మాస్టర్‌, అడొబ్‌ ప్రిమియర్‌ క్లిప్‌, మ్యాజిస్టో యాప్స్‌ వాడుకోవచ్చు.

మీరే ఎడిటర్‌...

కాన్ఫరెన్స్‌ల కోసం...

ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ అంటే జూమ్‌ అనేంతగా అలవాటైపోయింది. మరి దీనికి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఇటీవల భద్రత పరంగా ఈ యాప్‌ను వాడకూడదని భారత ప్రభుత్వమే హెచ్చరికలు జారీ చేసింది. దీనికి బదులు గూగుల్‌ మీట్‌, స్కైప్‌, మైక్రోసాఫ్ట్‌ టీమ్స్‌, గూగుల్‌ డుయో, వాట్సాప్‌ కాల్‌ లాంటివి వాడుకొవచ్చు. అలాగే దేశీయంగా రూపొందించిన సే నమస్తే యాప్‌ను ట్రై చేయొచ్చు.

కాన్ఫరెన్స్‌ల కోసం...

వీడియో షేరింగ్‌

టిక్‌టాక్‌.. ప్రస్తుతం చిన్నపెద్ద తేడా లేకుండా అందరిని ఆకట్టుకుంటున్న వీడియో షేరింగ్‌ యాప్‌. ఈ టిక్‌టాక్‌తోపాటు విగో వీడియో, లైక్‌, హలో యాప్‌ కూడా బాగా పాపులర్‌ అయ్యాయి. వీటికి బదులుగా రొపొసొ, డబ్‌ స్మాష్‌, పెరిస్కోప్‌లాంటి వాటిని కూడా ప్రయత్నించవచ్చు.

వీడియో షేరింగ్‌

ఫైల్స్‌ పంపడానికి...

ఫొటోలు, వీడియోలు, యాప్స్‌ ఫైల్స్‌ ఇలా వేటినైనా ఈ ఫైల్‌షేరింగ్‌ యాప్‌తో ఒకరి నుంచి మరొకరికి పంపుకోవచ్చు. ఇందుకోసం వాడే షేర్‌ఇట్‌, జెండర్‌ లాంటి యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేశారనుకోండి.. దాని స్థానంలో షేర్‌ ఫైల్స్‌, ఫైల్స్‌ బై గూగుల్​, జియో షేర్​, సెండ్​ ఎనీవేర్​ను వినియోగించవచ్చు.

ఫైల్స్‌ పంపడానికి...

భద్రత కోసం...

మొబైల్‌లోకి ఎలాంటి వైరస్‌ ప్రవేశంచకుండా, ప్రమాదకరమైన ఫైల్స్‌ను తొలగించేవే సెక్యూరిటీ యాప్స్‌. చాలా మొబైల్స్‌లో డీఫాల్ట్‌గా వచ్చే వన్‌ సెక్యూరిటీ యాప్‌ బదులు ఏవీజీ, అవాస్టా, నార్తన్‌‌ యాంటీ వైరస్‌ వంటి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

భద్రత కోసం...

టైప్‌ చేయాలంటే...

మొబైల్‌లో ఉండే డీఫాల్ట్‌ కీబోర్డుతో పాటు కొంతమంది అదనపు కీబోర్డులను ఇన్‌స్టాల్‌ చేసుకుంటుంటారు. వాటిలో గో కీబోర్డు, మింట్‌ కీబోర్డు యాప్స్‌ చైనాలో రూపొందించినవే. వీటి స్థానంలో గూగుల్‌ ఇండిక్‌ కీబోర్డు , గింగర్‌ కీబోర్డు, జీ బోర్డ్‌, మైక్రోసాఫ్ట్‌ స్విఫ్ట్‌ కీబోర్డు వాడొచ్చు.

టైప్‌ చేయాలంటే...

అర్థాల కోసం...

ఇతర భాషల్లోని పదాలకు అర్థాలు తెలుసుకోవడం కోసం చాలా మంది యూ డిక్షనరీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ యాప్‌, గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ లాంటి యాప్స్‌ వాడొచ్చు.

అర్థాల కోసం...

ఒకటికి మించి వాడాలంటే...

ఒకే ఫోన్‌లో రెండు వేర్వేరు అకౌంట్లతో యాప్‌లను వినియోగించడానికి ప్యార్‌లల్‌ యాప్‌ ఉపయోగపడుతుంది. ప్యార్‌లల్‌ స్పేస్‌, డ్యూయల్‌ స్పేస్‌, డ్యూయల్ యాప్‌, మల్టిపుల్‌ అకౌంట్స్‌ లాంటి యాప్స్‌ ఈ సౌకర్యం అందిస్తాయి. వీటికి బదులు క్లోన్‌ యాప్‌, సూపర్‌ క్లోన్‌ వంటి యాప్స్‌ను ట్రై చేయొచ్చు.

ఒకటికి మించి వాడాలంటే...

ఆఫీసు పనికి...

వృత్తిపరంగా, లేదా ఇతర పనుల నిమిత్తం వర్డ్‌, ఎక్సెల్‌ షీట్లను ఉపయోగించాల్సి వస్తే కొందరు డబ్ల్యూపీఎస్‌ ఆఫీస్‌ను వాడుతుంటారు. ఇందులో పీడీఎఫ్‌లు కూడా చూసుకోవచ్చు. ఈ యాప్‌ మీ మొబైల్‌లో వద్దనుకుంటే... దీని స్థానంలో మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌, ఓన్లీ ఆఫీస్‌ లాంటివి వాడొచ్చు.

ఆఫీసు పనికి...

ఇవీ చూడండి:

  1. చైనా ఫోన్లు వద్దా.. ఈ మోడళ్లపై లుక్కేయండి!
  2. నిషేధంతో టిక్​టాక్​ సంస్థకు రోజుకు ఎంత నష్టం?
  3. చైనా 'షేరిట్​'ను తలదన్నే స్వదేశీ యాప్​ వచ్చేసింది!
  4. టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా చింగారీ యాప్..​
  5. చైనా తీరు నచ్చట్లేదా.. 'రిమూవ్‌ చైనా యాప్స్'
  6. జూమ్​ యాప్​కు దీటుగా ఫేస్​బుక్ 'మెసెంజర్​ రూమ్స్​​'
Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details