తెలంగాణ

telangana

Nawaz Sharif Return To Pakistan : 4ఏళ్ల తర్వాత పాక్​కు నవాజ్ షరీఫ్.. జాతీయ నేరస్థుడంటూ ఇమ్రాన్ పార్టీ ఎద్దేవా

By PTI

Published : Oct 21, 2023, 7:34 PM IST

Updated : Oct 21, 2023, 7:41 PM IST

Nawaz Sharif Return To Pakistan : పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాలుగేళ్ల అనంతరం స్వదేశంలో అడుగుపెట్టారు. నాలుగేళ్ల పాటు లండన్​లో ఉన్న ఆయన.. త్వరలో దేశంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తిరిగి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఆయన రాకపై ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని విపక్ష పీటీఐ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

Nawaz Sharif Return to Pakistan
Nawaz Sharif Return to Pakistan

Nawaz Sharif Return To Pakistan :పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ పార్టీ అధినేత నవాజ్‌ షరీఫ్‌ నాలుగేళ్ల స్వీయ ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. దుబాయ్‌ నుంచి ప్రత్యేక విమానం ఉమీద్‌-ఇ-పాకిస్థాన్‌లో ఇస్లామాబాద్‌ చేరుకున్నారు. ఆయన వెంట కొందరు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, స్నేహితులు వచ్చినట్లు పీఎంఎల్-ఎన్ వర్గాలు తెలిపాయి.

Nawaz Sharif Return Date 2023 :అవినీతి ఆరోపణల కేసులో జైలు శిక్ష పడిన నవాజ్‌ షరీఫ్‌ మెరుగైన వైద్యచికిత్స కోసం లండన్‌ వెళ్లి అక్కడే నాలుగేళ్లు ఉన్నారు. జనవరిలో పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ పార్టీ ఎన్నికల్లో తలపడనుంది. ఇస్లామాబాద్‌లో గంటసేపు ఉన్న తర్వాత నవాజ్‌ షరీఫ్‌ లాహోర్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

అంతకుముందు, దుబాయ్‌లో మీడియాతో నవాజ్‌ షరీఫ్‌ మాట్లాడారు. పాకిస్థాన్‌లో ప్రస్తుతం భయానక పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్థాన్‌ను గట్టెక్కించే సత్తా తమ పార్టీకి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. స్వయంకృపరాధాలే పాక్​ను ముంచేశాయని పేర్కొన్న ఆయన.. పరిస్థితిని మరింత దిగజార్చకోకూడదని అన్నారు. పరిస్థితులను చక్కదిద్దే సామర్థ్యం తమకు ఉందని చెప్పుకొచ్చారు. పాక్​ను ఎవరూ పైకి లేపరని, సొంతంగానే ఎదగాలని అన్నారు. తన తండ్రి తిరిగి వచ్చిన రోజు తనకు అత్యంత ఆనందకరమైనదని షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ పేర్కొన్నారు. రాజకీయంగానూ ఆయన ఘనంగా తన పునరాగమనాన్ని చాటుతారని చెప్పారు.

నవాజ్ షరీఫ్​కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు

సైన్యంతో లోపాయికారీ ఒప్పందం
అయితే, పాక్ సైన్యం అండతోనే నవాజ్ షరీఫ్ స్వదేశంలో అడుగుపెట్టగలిగారంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. షరీఫ్ పార్టీకి, పాక్ సైన్యానికి లోపాయికారీ అవగాహన ఏర్పడిందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆర్మీ అండదండలతో పాటు.. విపక్ష పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్న నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఇదే సరైన సమయమని నవాజ్ షరీఫ్ భావించినట్లు సమాచారం.

'ఆయనో జాతీయ నేరస్థుడు'
నవాజ్ షరీఫ్ తిరిగి రావడంపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ).. వ్యంగ్యాస్త్రాలు సంధించింది. నవాజ్​ను జాతీయ నేరస్థుడిగాఅభిర్ణించిన పీటీఐ.. ఆయనకు ఆహ్వానం పలుకుతూ పరువు తీశారని పడింది. ఆయన్ను పాక్ ప్రభుత్వం దత్తత తీసుకున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేసింది. అయితే, దేశ సంపదను దోచుకున్న నవాజ్ షరీఫ్​ను ప్రజలు కచ్చితంగా బాధ్యుడిని చేస్తారని వ్యాఖ్యానించింది.

Nawaz Sharif About Pakistan Situation : 'భారత్‌ చంద్రుడిని చేరుకుంటే.. పాక్​ మాత్రం​ ప్రపంచాన్ని అడుక్కుంటోంది'

Pakistan Imran Khan Jail Facility : పురుగులు, ఈగలున్న జైల్లో పాక్​ మాజీ ప్రధాని.. జీవితాంతం అక్కడే ఉంటానంటూ..

Last Updated : Oct 21, 2023, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details