ETV Bharat / international

Nawaz Sharif About Pakistan Situation : 'భారత్‌ చంద్రుడిని చేరుకుంటే.. పాక్​ మాత్రం​ ప్రపంచాన్ని అడుక్కుంటోంది'

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 6:56 AM IST

Updated : Sep 20, 2023, 8:14 AM IST

Nawaz Sharif About Pakistan Situation : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌పై ఆ దేశ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ విమర్శలు గుప్పించారు. భారత్​ చంద్రుడిని చేరుకుంటే.. పాకిస్థాన్​ మాత్రం ప్రపంచం ముందు అడుక్కుంటోందని అన్నారు.

Nawaz Sharif About Pakistan Situation
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై నవాజ్​ షరీఫ్​ కామెంట్స్

Nawaz Sharif About Pakistan Situation : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌పై ఆ దేశ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు భారత్‌ చంద్రుడిని చేరి, జీ20 సమావేశాలను సైతం జరుపుతుంటే.. పాకిస్థాన్‌ మాత్రం ప్రపంచం ముందు అడుక్కుంటోందని వ్యాఖ్యానించారు. పాక్​ ఇలా ఆర్థిక గందరగోళాన్ని ఎదుర్కోడానికి దేశంలోని మాజీ జనరళ్లు, కొందరు న్యాయమూర్తులే కారణమని ఆయన విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ సమావేశంలో లండన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో నవాజ్​ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన పాక్‌ దీన స్థితిని ప్రస్తావించారు.

"పాకిస్థాన్‌ ప్రధాని నేడు దేశ విదేశాలు తిరుగుతూ నిధుల కోసం వేడుకొంటున్నారు. భారత్‌ సాధించిన ఘనతను పాకిస్థాన్​ ఎందుకు సాధించలేకపోయింది? దీనికి బాధ్యులు ఎవరు?" అంటూ లాహోర్‌లో సమావేశమైన పార్టీ ముఖ్యులను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. "వాజ్‌పేయీ ప్రధాని అయినప్పుడు.. భారత్‌ వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలు కేవలం బిలియన్‌ డాలర్లు మాత్రమే. కానీ ఇప్పుడు భారత్‌ విదేశీ మారకం విలువ సుమారు 600 బిలియన్‌ డాలర్లు. భారత్‌ ఎక్కడకు చేరింది.. మనం ఎక్కడున్నాం?" అంటూ నవాజ్​ ప్రసంగిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.

తన ఉద్వాసన వెనుక నలుగురు న్యాయమూర్తులు, అప్పటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వాతోపాటు ఐఎస్‌ఐ చీఫ్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌ ఉన్నారంటూ ఆరోపించారు. పాక్​ ఈ దుస్థితికి చేరుకోడానికి కారణమైన ఈ అధికారులు జవాబుదారీ వహించాల్సి ఉంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని నవాజ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Pakistan Financial Crisis : పాకిస్థాన్​ తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. అంతకుముందు శ్రీలంక పరిస్థితి ఎలా తయారైందో .. ప్రస్తుతం పాక్​ కూడా అదే దిశగా వెళుతోంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతోపాటు భౌగోళిక, రాజకీయ సమస్యలతో దాయాది దేశం విలవిలలాడుతోంది. దీంతో అప్పట్లో ఇంధన పొదుపు కోసమని ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యుత్‌ వాడకంపై ఆంక్షలు విధించారు. అంతే కాకుండా అమెరికాలోని తమ పాత రాయబార కార్యాలయాలను కూడా పాక్‌ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది.

3 వారాలకే విదేశీ మారక నిల్వలు.. దివాలా అంచున పాకిస్థాన్​.. మరో శ్రీలంకగా మారనుందా..?

'ప్రాణాలు పోయినా వినరా?'.. ప్రజల ఆకలి బాధలు.. పట్టించుకోని పాక్ సర్కారు!

Last Updated : Sep 20, 2023, 8:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.