తెలంగాణ

telangana

'ఆర్‌ఆర్‌ఆర్‌' నటుడు రే స్టీవెన్​సన్ హఠాన్మరణం

By

Published : May 23, 2023, 6:26 AM IST

Updated : May 23, 2023, 12:55 PM IST

rrr movie villain

Ray Stevenson death : 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా నటించిన ఐరిష్‌ నటుడు రే స్టీవెన్​సన్ కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Ray Stevenson death : 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా నటించిన ఐరిష్‌ నటుడు రే స్టీవెన్​సన్ అకాల మరణం చెందారు. ఆయన హఠాన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. స్టీవెన్సన్​ మరణ వార్త తెలిసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఆత్మీయులు, తోటి నటులు, అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

RRR Villain Death: ఆయన మృతి పట్ల 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రబృందం సోషల్​ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది. "ఈ వార్త మమ్మల్ని ఎంతో షాక్‌కు గురిచేసింది. మీ ఆత్మకు శాంతి కలగాలి. మీరెప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారు" అని పేర్కొంది. కాగా ఈయన 'ఆర్​ఆర్​ఆర్​'​ సినిమాలో గవర్నర్‌ స్కాట్‌ బక్​స్టన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

1964 మే 25న నార్త్‌ ఐర్లాండ్‌లోని లిస్‌బర్న్‌లో జన్మించిన స్టీవెన్సన్‌.. హాలీవుడ్​లోని ప్రముఖ 'థోర్‌' సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు. ఈ సిరీస్​తో ఆయన హాలీవుడ్​లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక స్టీవెన్సన్‌కు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఎనిమిదేళ్ల వయసులోనే ఇంగ్లాండ్‌ చేరుకున్న ఆయన బ్రిటిష్‌ ఓల్డ్‌ విక్‌ థియేటర్‌ స్కూల్‌లో ప్రవేశాన్ని పొందారు. 29 ఏళ్లకు గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసిన స్టీవెన్సన్​.. 1990లో టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలా తన కెరీర్​ తొలి రోజుల్లో టీవీ షోల్లో నటించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత పలు హాలీవుడ్‌ చిత్రాల్లో నటించారు. ఇక 1998లో 'థియరీ ఆఫ్‌ ఫ్లైట్‌' అనే చిత్రంతో తొలిసారిగా ఆయన సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.

1997లోనే రూత్ గెమ్మెల్ అనే హాలీవుడ్ నటిని రే స్టీవెన్సన్ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2005లో విడిపోయారు. ఆ తర్వాత ఆయన ఆంత్రోపాలజిస్టు ఎలిసబెట్టా కరాకియాతో సహజీవనం చేస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

ఆ తర్వాత 'గ్రీన్‌విచ్‌ మీన్‌ టైమ్‌ ఇన్‌ 1999', 'కింగ్‌ ఆర్థర్‌', 'పనిషర్‌ వార్‌ జోన్‌', 'బుక్‌ ఆఫ్‌ ఎలీ', 'ది అదర్‌ గాయ్స్‌', 'జో రిటాలియేషన్‌', 'డివర్జెంట్', 'ది ట్రాన్స్‌పోర్టర్‌: రిప్యూల్‌డ్‌', 'యాక్సిడెంట్‌ మ్యాన్‌', 'మెమొరీ', 'థోర్‌' సిరీస్‌లతో ఎంతో ఫేమస్‌ అయ్యారు. 'డెక్స్‌టార్‌', 'స్టార్‌వార్స్‌ రెబెల్స్‌' లాంటి పలు టీవీ షోలతోనూ ఈ స్టార్​ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇక సుదీర్ఘంగా సాగిన ఆయన జర్నీలో నటుడిగా మంచి గుర్తింపు పొంది ఎన్నో మైల్​స్టోన్స్​ను అందుకున్నారు. ఆయన చివరి సారిగా నటించిన డిస్నీ+'అషోకా' సిరీస్‌ త్వరలో విడుదలకు సిద్ధం కానుంది.

'56 ఏళ్లు.. అయినా ఏ మాత్రం సంకోచించలేదు'
Rajamouli Condolences to Ray stevenson :రే స్టీవెన్సన్ మరణం నమ్మలేకపోతున్నానని ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి అన్నారు. ఈ మేరకు రే మరణం పట్ల సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేసిన రాజమౌళి... సెట్ లో రే ఎంతో ఉత్సాహాంగా ఉండే వారని గుర్తుచేసుకున్నారు. ప్రతి రోజు ఎంతో ఆనందంగా పనిచేసే వారని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తూ.. ఆయన ఆత్మ శాంతించాలని కోరారు.

RRR team condoloneces to sevenson : "షాకింగ్.. ఈ వార్తను నేను నమ్మలేకున్నాను. షూటింగ్ సెట్స్ లో రే ఎంతో ఎనర్జీని, చైతన్యాన్ని తీసుకొచ్చేవాడు. ఆయనతో కలసి పనిచేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉండేది. ఆయన కుటుంబం కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. మరోవైపు 'ఆర్ఆర్ఆర్' టీమ్ సైతం స్టీవెన్సన్ గురించి ఓ పోస్ట్ షేర్​ చేసింది. సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన చేసిన ఓ సాహస దృశ్యాన్ని షేర్ చేసింది. ‘"ఈ కష్టమైన సీన్​ను​ స్టీవెన్సన్​తో చిత్రీకరిస్తున్న సమయంలో ఆయన వయసు 56 ఏళ్లు. అయినా, దీన్ని చేసేందుకు ఆయన ఏ మాత్రం సంకోచించలేదు. సెట్స్ లో మీరున్నందుకు ఎప్పటికీ సంతోషిస్తాం. చాలా త్వరగా మమ్మల్ని వీడి వెళ్లారు" అని ట్వీట్ చేసింది.

జూనియర్ ఎన్టీఆర్ సైతం స్టీవెన్సన్​ మృతి పట్ల స్పందించారు. "రే స్టీవెన్సన్ మరణ వార్త షాక్ కు గురిచేస్తోంది. చాలా త్వరగా వెళ్లిపోయారు. ఆయనతో కలసి నటించడం ఓ గొప్ప అనుభవం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబం కోసం నా ప్రార్థనలు" అని జూనియన్ ఎన్టీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Last Updated :May 23, 2023, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details