Bichagadu 2 Collections : 'బిచ్చగాడు' బ్రాండ్ సో స్ట్రాంగ్​.. ఫస్ట్ వీకెండ్​ కలెక్షన్స్​ అదుర్స్​

author img

By

Published : May 22, 2023, 7:01 PM IST

Updated : May 22, 2023, 7:53 PM IST

Bichagadu 2 Weekend collections in Telugu states

బాక్సాఫీస్​ ముందు 'బిచ్చగాడు 2'కు హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. ఈ చిత్ర వీకెండ్ కలెక్షన్స్​ ​ఎంతంటే?

Bichagadu 2 Collections : తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన 'బిచ్చగాడు 2'కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విజయ్​ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఫస్ట్ షో రివ్యూలకు భిన్నంగా మౌత్‌టాక్‌తో ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. అలా మే 19న విడుదలై తొలి రోజు నుంచి హిట్​ టాక్ తెచుకున్న ఈ మూవీకి బాక్సాఫీస్​ ముందు కలెక్షన్లు మంచిగా వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆడియెన్స్​ బాగా ఆదరిస్తున్నారు. అయితే ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్​లో బాగా వసూలు చేసింది.

ఈ చిత్రానికి తెలుగులో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. థియేట్రికల్ రైట్స్ కోసం గట్టి పోటీనే ఏర్పడగా.. డిమాండ్​కు తగ్గట్టే రూ. 6కోట్ల వరకు బిజినెస్‌ జరిగింది. అలాగే వరల్డ్ వైడ్​గా రూ. 15 కోట్ల జరిగిందని సమాచారం. అయితే ఈ సినిమా తెలుగులో ఫస్ట్ వీకెండ్​లో రూ.9.5కోట్ల వరకు కలెక్షన్లను అందుకుందని సమాచారం అందింది. ఓ చిన్న తమిళ డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్​లో కలెక్షన్స్​ రావడం మంచి విషయం. దీంతో ఈ వీకెండ్​ కూడా వసూళ్లు ఇంకా పెరుగుతూనే ఉంటాయని ట్రేడ్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.21.25 కోట్ల గ్రాస్ వసూలు చేసిందట.

బిచ్చగాడు 3పై విజయ్​ ఆంటోని.. బిచ్చగాడు 2కు వస్తున్న రెస్పాన్స్​పై హర్షం వ్యక్తం చేసిన విజయ్​ ఆంటోని.. 'బిచ్చగాడు 3'పై మాట్లాడారు. "బిచ్చగాడు2 కు కొనసాగింపుగా మూడో భాగం కూడా తెరకెక్కుతుంది. అది పూర్తిగా డిఫరెంట్​ కాన్సెప్ట్​ కథతో తెరకెక్కుతుంది. స్క్రిప్ట్‌ను రెడీ చేయడానికి ఏడాదికి పైనే సమయం పడుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2025లో సినిమాను ప్రారంభిస్తా. దానికి కూడా నేనే డైరెక్ట్​ చేస్తా అని విజయ్​ అన్నారు.

  • #Bichagadu2 posts a terrific weekend for its costs with a Genuine ₹9.5 Cr Apx Gross in Telugu States. It’s a BoxOffice Hit with Distributors in safe zone in weekend itself. pic.twitter.com/1zdDvr0Ome

    — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) May 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇక సినిమా విషయానికొస్తే.. 2016లో వచ్చిన 'బిచ్చగాడు' సూపర్ డూపర్ హిట్​గా నిలిచింది. ఏ అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్​ వద్ద అదిరిపోయే కలెక్షన్లను అందుకుంది. మధర్​ సెంటిమెంట్​ బాగా ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌గా 'బిచ్చగాడు 2'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఈ సినిమా కోసం సినీ ప్రియులు థియేటర్​కు వెళ్లగా.. సినిమా కూడా అంచనాలను అందుకుంది. ఈ సీక్వెల్​ విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. మ్యూజిక్ డైరెక్టర్​ కూడా ఆయనే. ఆయన భార్యనే సినిమా నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్​ హీరోయిన్​గా నటించింది. రాధారవి, వైజీ మహేంద్రన్‌, మన్సూర్‌ అలీఖాన్‌, హరీశ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: స్టేజ్​పై నరేశ్​-పవిత్ర రొమాంటిక్‌ డ్యాన్స్​.. చూశారా?
Last Updated :May 22, 2023, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.