స్టేజ్‌పై నరేశ్-పవిత్ర రొమాంటిక్ డ్యాన్స్.. చూశారా?
Published: May 22, 2023, 5:27 PM


స్టేజ్‌పై నరేశ్-పవిత్ర రొమాంటిక్ డ్యాన్స్.. చూశారా?
Published: May 22, 2023, 5:27 PM

ప్రముఖ నటుడు నరేశ్-నటి పవిత్ర లోకేశ్ కలిసి రొమాంటిక్ డ్యాన్స్ చేశారు. ఇద్దరు అదిరిపోయే స్టెప్పులతో ఆడియెన్స్ చేత ఈలలు వేయించారు. ప్రస్తుతం ఆ వీడియో ఫుల్ ట్రెండ్ అవుతోంది. మీరు చూశారా?
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ ట్రెండింగ్ కపుల్ అంటే టక్కున వినిపించే పేరు నరేశ్-పవిత్రా లోకేష్. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్ షిప్లో ఉన్న దాదాపుగా అందరికీ సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు చిత్రాలలో కలిసి నటించిన ఈ జంట.. ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేసి ప్రధాన పాత్రల్లో 'మళ్లీ పెళ్లి' అనే సినిమా చేశారు. నరేశ్.. ఈ మధ్య కాలంతో తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ మూవీ తీశారు! త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై కాస్త ఇంట్రెస్ట్‌ను పెంచాయి. అయితే సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ నరేశ్-పవిత్రా లోకేష్.. సినిమాపై మరింత హైప్ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ జంట ఓ స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ రచ్చ చేశారు. రొమాంటిక్ స్టెప్పులు వేసి.. ప్రేక్షకుల చేత ఈలలు వేయించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
-
You can't afford to miss this 😍
— YouWe Media (@MediaYouwe) May 21, 2023
The Boldest couple @ItsActorNaresh & #PavitraLokesh just lit up the #MalliPelli Pre-Release Event with their lively dance 🕺💃
▶️ https://t.co/Fy2RH2UXgH
Event By @MediaYouwe ✌️#MalliPelliOnMay26 💥@MSRajuOfficial @vanithavijayku1… pic.twitter.com/LkWpO5sFqO
ఇక మళ్లీ పెళ్లి సినిమా విషయానికొస్తే.. 'ఒక్కడు', 'వర్షం' లాంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన ఎం.ఎస్.రాజు.. దర్శకుడిగా మారి 'డర్టీ హరి', '7 డేస్ 6 నైట్స్' వంటి బోల్డ్ కంటెంట్ చిత్రాలను రూపొందించారు. ఆయనే ఇప్పుడు మళ్లీ పెళ్లితో ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నరేశ్ రెండో భార్య రమ్య రఘుపతి పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించారు. ప్రముఖ నటుడు నరేశ్ తన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న సంఘటన ఆధారంగా నటిస్తూ నిర్మించిన చిత్రమిది. విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జయసుధ, శరత్ బాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి- అరుల్ దేవ్ సంగీతం అందించారు. ఎం.ఎన్.బాల్ రెడ్డి. ఛాయాగ్రహణం అందించారు.
నా జీవిత కథ కాదు.. నరేశ్- తన రెండో భార్య రమ్య రఘుపతితో విభేదాలు, ఆయన పవిత్రతో చనువుగా ఉండడం.. తెలిసిన విషయమే. ఈ పరిణామాల నేపథ్యంలో 'మళ్లీ పెళ్లి' సినిమా టీజర్, ట్రైలర్ చూస్తుంటే అవన్నీ అందులో కనపడుతున్నాయి. దీంతో ఈ సినిమా నరేశ్ జీవిత కథ అని అర్థమవుతోంది. సినీ అభిమానుల్లో ఆసక్తి కూడా నెలకొంది. కానీ ఇది తన జీవిత కథ కాదని ప్రతి ఒక్కరికీ ఏదోక చోట కనెక్ట్ అయ్యేలా ఉంటుందని నరేశ్ అంటున్నారు. చూడాలి మరి తెరపై ఈ సినిమా కథేంటో..
