తెలంగాణ

telangana

National Film Awards 2021 Winners : జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. నటిగా ఆలియా భట్​

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 6:01 PM IST

Updated : Aug 24, 2023, 7:52 PM IST

National Film Awards Best Actor And actress winner : 2021 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​ ఎంపికయ్యారు. ఆయన నటించిన పుష్ప ద రైజ్​ సినిమాకుగాను ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇక ఉత్తమ నటిగా బాలీవుడ్​ నటి ఆలియా భట్​కు దక్కింది.

National Film Awards Best Actor And actress winner
National Film Awards Best Actor And actress winner

National Film Awards Best Actor And actress winner :2021 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ నటుడిగా ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​ఎంపికయ్యారు. ఆయన నటించిన 'పుష్ప ద రైజ్'​ సినిమాకుగాను ఈ అవార్డును గెలుచుకున్నారు. అయితే 69 ఏళ్లలో ఒక తెలుగు హీరోకు జాతీయ అవార్డుదక్కడం ఇదే తొలిసారి. ఇక ఉత్తమ నటి అవార్డు ఈ సారి ఇద్దరిని వరించింది. 'గంగూబాయ్​ కటియావాది' సినిమాలో తన నటనకు గాను బాలీవుడ్​ నటి ఆలియా భట్​ను వరించగా.. 'మిమి' సినిమాకు గాను కృతి సనన్​ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప ద రైజ్' 2021లో రికార్డులు కొల్లగొట్టింది. ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త పాన్ ఇండియా హీరో అయ్యారు. 'తగ్గేదెలే' అంటూ అల్లు అర్జున్.. ఈ సినిమాలో పేల్చిన డైలాగ్ దేశవ్యాప్తంగా వైరల్​గా మారింది. సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం.. మేటి క్రికెటర్లు సైతం గ్రౌండ్​లో ఫాలో అయ్యారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్​గా సుకుమార్ 'పుష్ప ద రూల్' ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలె ఈ సినిమా నుంచి వేర్​ ఈజ్​ పుష్ప (పుష్ప ఎక్కడా) అంటూ.. ఓ వీడియోను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్​. ఈ వీడియోకు సైతం మంచి రెస్పాన్స్​ లభించింది. కాగా ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక అల్లు అర్జున్​కు జాతీయ పురస్కారం లభించడం వల్ల.. అతడి ఫ్యాన్స్​ సంబంరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు స్ట్రైలిష్ స్టార్ ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఉత్తమ నటి కృతిసనన్​..
Kriti Sanon National Award : దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కించిన 'మిమీ' చిత్రంలో తన నటనకు గాను కృతిసనన్​కు ఈ పురస్కారం లభించింది. సరోగసీ (అద్దె గర్భం దాల్చడం) నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కృతి.. సరోగేట్‌ తల్లిగా (అద్దె గర్భం దాల్చడం) కనిపించి ఆకట్టుకుంది.

ఆలియా భట్ ( గంగూబాయి కఠియావాడి)..
Alia Bhatt National Award :ముంబయి మాఫియా మహిళా డాన్‌గా పేరొందిన గంగూబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. సంజయ్‌ లీలా భన్సాలీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 2022లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది. కాగా 2023 ఐఫా అవార్డుల్లో.. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, సినిమాటోగ్రఫీ వంటి పురస్కారాలను 'గంగూబాయి కఠియావాడి' సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఉత్తమ నటి అవార్డు ఆలియాకు దక్కింది.

ఆలియా 'గంగూబాయి..' పేరు మార్చాలని సుప్రీంకోర్టు సూచన

అల్లు అర్జున్​ లీక్స్​.. 'పుష్ప 2' డైలాగ్​ చెప్పేసిన బన్నీ..

Last Updated : Aug 24, 2023, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details