ETV Bharat / entertainment

Pushpa 2 Poster : ఇది అల్లు అర్జున్ స్టామినా అంటే.. 'పుష్ప 2' ఆల్​ టైమ్ రికార్డ్​.. ఫస్ట్ ఇండియన్ సినిమాగా ఘనత

author img

By

Published : Aug 12, 2023, 10:07 PM IST

Updated : Aug 13, 2023, 7:22 AM IST

Pushpa 2 Poster : ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సరికొత్త రికార్డును అందుకున్నారు. ఆయన నటిస్తోన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'పుష్ప 2' రిలీజ్​కు ముందే ఓ ఘనతను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ ఓ పోస్ట్‌ పెట్టింది. ఇంతకీ ఆ ఘనత ఏమిటంటే..?

Pushp 2 Poster : ఇది అల్లు అర్జున్ స్టామినా అంటే.. 'పుష్ప 2' ఆల్​ టైమ్ రికార్డ్​.. ఫస్ట్ ఇండియన్ సినిమాగా ఘనత
Pushp 2 Poster : ఇది అల్లు అర్జున్ స్టామినా అంటే.. 'పుష్ప 2' ఆల్​ టైమ్ రికార్డ్​.. ఫస్ట్ ఇండియన్ సినిమాగా ఘనత

Pushpa 2 Poster : ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సరికొత్త రికార్డును అందుకున్నారు. ఏప్రిల్‌ 8న 'పుష్ప 2' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మూవీటీమ్​ విడుదల చేసింది. ఇందులో అల్లుఅర్జున్​ అమ్మవారి అలంకారంలో గన్‌ చేత పట్టుకుని కనిపించి ఆకట్టుకున్నారు. ఈ పోస్టర్‌.. దాదాపు నాలుగు నెలల వ్యవధిలోనే సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ ఇన్‌స్టాలో 7 మిలియన్ల లైక్స్‌ సాధించి సెన్సేషన్​ రికార్డు క్రియేట్‌ చేసింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ ట్వీట్‌ చేసింది. ఇన్‌స్టాలో ఇన్ని మిలియన్ల లైక్స్‌ సాధించిన తొలి ఇండియన్ సినిమా పోస్టర్‌ ఇదేనని తెలిపింది. దీనిపై అల్లు అర్జున్​ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Pushpa 2 movie updates : దేశవ్యాప్తంగా ఇండియన్ మూవీ లవర్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'పుష్ప 2' ఒకటి. మొదటి భాగం ఎంతటి సంచలనం సృష్టించడంతో తెలిసిన విషయమే. దీంతో అందరూ రెండో భాగం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు అప్డేట్స్ మాత్రమే వచ్చాయి. అందులో ఒకటి 'పుష్ప: ది రూల్' మూవీ టీజర్. The HUNT before the RULE పేరుతో విడుదల చేసిన ఈ టీజర్​కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తిరుపతి జైలు నుంచి 8 బుల్లెట్టు గాయాలతో తప్పించుకున్న 'పుష్ప' కోసం పోలీసులు వెతకడంతో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

ఈ ప్రచార చిత్రంలో 'పుష్ప' మద్దతుదారులు నిరసనలు, అల్లర్లు చేయడం, పోలీసులు 144 సెక్షన్ విధించడం, ఈ క్రమంలోనే పుష్ప గొప్పతనం గురించి ప్రజలు మాట్లాడుకోవడం, మీడియాకు చెప్పడం, ఆ తర్వాత వార్తల్లో పోలీసులే పుష్పను ఎన్ కౌంటర్ చేశారని చెప్పడం, అంతలోనే అడవిలో పుష్ప వేసుకున్న చొక్క రక్తపు మడుగులో దొరకడం వంటివి చపించారు. అయితే ఆ తర్వాత పులుల కోసం ఏర్పాటు చేసిన కెమెరాల్లో 'పుష్ప' కనిపించే సీన్​ ప్రచార చిత్రానికే హైలైట్​గా నిలిచింది.

అలాగే ఈ గ్లింప్స్​తో పాటు బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇది చూసిన సినిమా లవర్స్​ షాక్ అయిపోయారు. ఇందులో అల్లు అర్జున్ అమ్మవారి అవతారంతో చేతిలో గన్ పట్టుకునే మైండ్ బ్లోయింగ్ రేంజ్​ కనిపించి సర్​ప్రైజ్​ ఇచ్చారు. ఈ పోస్టర్​ ఇండియా వైడ్​గా సెన్సేషన్​ క్రియేట్ చేసింది. ఇప్పుడా పోస్టరే ఇన్‌స్టాలో 7 మిలియన్ల లైక్స్‌ సాధించి సెన్సేషన్​ రికార్డు క్రియేట్‌ చేసింది.

Fahadh Faasil First Look : షెకావత్​ ఆగయా.. ఈ సారి పుష్ప మీద రివెంజ్​ ప్లాన్ ?

Pushpa 2 The Rule : 'పుష్ప టీమ్​ మేలుకో'.. బన్నీ అభిమానుల ట్వీట్ల మోత

Last Updated : Aug 13, 2023, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.