తెలంగాణ

telangana

అంబులెన్స్ వాహన డ్రైవర్‌తో వాగ్వాదం.. రోగి మృతి

By

Published : Nov 19, 2022, 1:30 PM IST

ఓ వ్యక్తి దూకుడు స్వభావంతో నిండు ప్రాణం బలైెంది. అంబులెన్స్ వస్తే అందులో వ్యక్తి ప్రాణాలు కాపాడాలని దారిస్తాం.. కానీ ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లాలో ఓ వ్యక్తి చేసిన పనికి రోగి ప్రాణమే పోయింది. ఎలా అంటే..?

ambulance driver
ambulance driver

అంబులెన్స్ వాహన డ్రైవర్ తో వాగ్వాదం.. రోగి మృతి

ఓ ద్విచక్ర వాహనదారుడు 108 వాహనాన్ని ఆపి డ్రైవర్‌తో వాగ్వాదం పెట్టుకోవడంతో వాహనంలో ఉన్న రోగి మృతి చెందారు. ఏపీలోని కడపకు చెందిన ఓ మహిళ అనారోగ్య రీత్యా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను 108 వాహనంలో ఆంధ్రప్రదేశ్​లోని కడప ప్రభుత్వ సరోజన ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. కడప శివారులోని వైఎస్సార్ విగ్రహం సమీపంలోని రింగ్ రోడ్డు వద్దకు రాగానే 108 వాహనం, ద్విచక్ర వాహనం రెండు ఢీకొన్నాయి.

దీంతో ద్విచక్ర వాహనం కొద్దిగా దెబ్బతింది. వెంటనే ద్విచక్ర వాహనదారుడు అంబులెన్స్ ఆపి డ్రైవర్​తో వాగ్వాదం పెట్టుకోవడమే కాక.. అతనిపై దాడి చేసి దాదాపు 15 నిమిషాల పాటు అంబులెన్స్ కదలనివ్వలేదు. రోగి బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లాలని, అంబులెన్స్ డ్రైవర్ రోగిని ఆసుపత్రిలో దించేసి వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పినా వినలేదు. అప్పటికే రోడ్డుపై వాహనాలు బారులు తీరాయి. చివరకు 108 వాహన డ్రైవర్ ఎలాగోలా రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అరగంటలోపే ఆమె మృతి చెందింది. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లయితే రోగి బతికేదని వైద్యులు చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details