తెలంగాణ

telangana

కర్ణాటకలో బస్సు ప్రమాదం.. తెలుగు దంపతులు మృతి

By

Published : Oct 3, 2022, 5:56 PM IST

Karnataka Bus Accident: బెంగళూరు సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన దంపతులు మరణించగా.. 18 మంది గాయపడ్డారు. ఆదివారం ఆర్ధరాత్రి కర్ణాటకలోని హొసోట్​ సమీపంలో ఈ ఘటన జరిగింది.

Karnataka Bus Accident
Karnataka Bus Accident

AP Couple killed in Bus Accident: కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో జరిగిన బస్సు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్​కు​ చెందిన దంపతులిద్దరూ మరణించారు. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు 18మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు చిత్తూరు జిల్లా బలిజకండ్రిగ నుంచి బెంగళూరు బయల్దేరింది.

ఆదివారం రాత్రి కర్ణాటకలోని మైలాపుర వద్దకు రాగానే.. రాళ్లను తరలిస్తున్న ట్రక్కును బస్సు వెనక వైపు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన దంపతులిద్దరూ మరణించగా.. ముగ్గురు చిన్నపిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ స్వల్ప గాయలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో మరణించిన తెలుగు దంపతుల వివరాలు తెలియాల్సి ఉంది.​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details