తెలంగాణ

telangana

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. బాధితుల్లో 15 మంది మైనర్‌ బాలికలు?

By

Published : Jan 30, 2023, 11:20 AM IST

police raids on brothels in kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహాల్లో 15 మంది బాధిత మైనర్​ బాలికలు ఉన్నట్లు సమాచారం.

Police raid on brothels house
వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి

police raids on brothels in kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పలు పోలీస్​స్టేషన్ల పరిధిలో కొనసాగుతున్న వ్యభిచార గృహాలపై సోమవారం పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. మైనర్‌ బాలికలే లక్ష్యంగా వ్యభిచార కూపంలోకి లాగుతున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహాల్లో 15 మంది మైనర్‌ బాలికలు ఉన్నట్లు సమాచారం.

ప్రత్యేకంగా వ్యభిచార గృహాలు ఏర్పాటు చేసి బాలికలు, యువతులను అక్కడికి తీసుకెళ్తున్న కొంతమంది నిర్వాహకులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఓ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇంకా ఎక్కడెక్కడ వ్యభిచార కేంద్రాలు కొనసాగుతున్నాయన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం మధ్యాహ్నం పోలీసు అధికారులు వెల్లడించే అవకాశముంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details