తెలంగాణ

telangana

ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య

By

Published : Apr 21, 2021, 8:35 AM IST

Updated : Apr 21, 2021, 3:43 PM IST

suicide
మహిళ ఆత్మహత్య

08:32 April 21

ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య

మహిళ ఆత్మహత్య

అత్తింటి వేధింపుల భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకొంది. తన మూడేళ్ల కుమారుడు, 13 నెలల కుమార్తెతో సహా వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది.

సమాచారం అందుకున్న పెద్దపల్లి డీసీపీ రవీందర్​, ఏసీపీ నికితా పంత్​.. బావిలోంచి మృతదేహాలను బయటకు తీయించారు. అనంతరం మృతురాలు విజయ.. తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు.

అల్లుడు స్వామితో సహా మిగతా కుటుంబ సభ్యులు.. తమ కుమార్తెను వేధింపులకు గురిచేసినట్లు బాధితులు.. పోలీసులకు చెప్పారు. మంగళవారం కూడా తమ కుమార్తె విజయతో.. ఆమె ఆడపడుచు పద్మ గొడవ పడిందని.. తమతో చెప్పినట్లు పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తుచేసి.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు వెల్లడించారు. విజయ భర్త స్వామి, ఆమె ఆడపడుచు పద్మను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: నిలకడగా సీఎం ఆరోగ్యం.. కోలుకోవాలంటూ పూజలు

Last Updated : Apr 21, 2021, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details