తెలంగాణ

telangana

Drugs in Farmhouses: ఆటాపాట.. సయ్యాట.. కొన్నింటిలో మత్తు పదార్థాల వినియోగం

By

Published : Nov 2, 2021, 9:30 AM IST

రాజధాని చుట్టుపక్కల వేలాదిగా ఫాంహౌస్‌లు నిర్మించారు. వాటిలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. పోలీస్‌స్టేషన్లవారీగా రూ.కోట్లలో లంచాలు ముట్టచెబుతుండటంతో పోలీసులు చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు. వీటిని ఇలాగే ఉపేక్షిస్తే భవిష్యత్తులో వేలాది మంది యువత జీవితాలు నాశనం అవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నానాటికీ పెరుగుతున్న విష సంస్కృతిపై ప్రత్యేక కథనం.

Farmhouses
ఫాంహౌస్‌

ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు.. కానీ వేలాదిగా ఫాంహౌస్‌లు కట్టేశారు. జూదం నిర్వహించరాదు.. అయినా రాత్రిపగళ్లు రూ.కోట్లలో జూదం నడుస్తోంది. అసాంఘిక కార్యకలాపాలు నిషేధం.. కానీ వ్యభిచారంతో పాటు, మద్యం, డ్రగ్స్‌ యథేచ్ఛగా దొరుకుతున్నాయి.

భాగ్యనగరం చుట్టుపక్కల మండలాల్లో వెలసిన 25 వేల ఫాంహౌస్‌ల్లో మొయినాబాద్‌లో అయిదువేల వరకు ఉన్నాయి. శంషాబాద్‌లోనూ భారీగానే ఉన్నాయి. అలాగే గండిపేట చుట్టుపక్కల, షాద్‌నగర్‌, కొత్తూరు, నందిగామ, మహేశ్వరం, కీసర, శామీర్‌పేట, మేడ్చల్‌ తదితర మండలాల్లోనూ వెలిశాయి. మొయినాబాద్‌ మండలం పూర్తిగా, శంషాబాద్‌ మండలంలో ఒకట్రెండు గ్రామాలు తప్ప అన్నీ 111 జీవో పరిధిలోనే ఉన్నాయి. ఈ జీవో పరిధిలో ఉన్న ప్రాంతాల్లో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు. కనీసం గ్రామ పంచాయతీ అనుమతి లేకుండానే భారీ భవనాలు నిర్మించారు. పంచాయతీ నుంచి ఇంటి నంబరు తీసుకుని విద్యుత్తు కనెక్షన్‌ తీసుకుంటున్నారు. తర్వాత ఫాంహౌస్‌లు, రిసార్టులగాను తీర్చిదిద్దారు. వీటిలో 70 శాతం నిర్మాణాలకు అనుమతులు లేవని పంచాయతీ పాలకవర్గాలకు, పోలీసులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోరు. కారణం వాటిల్లో అధిక శాతం ప్రజాప్రతినిధులవో, స్థానికంగా పట్టున్న నాయకులవో కావడమే. ఫలితంగా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) వాటి జోలికి వెళ్లడంలేదు.

సకల సౌకర్యాలతో..

నగరానికి చెందిన ప్రముఖులు, నాయకులు శివారుల్లో వేలాది ఎకరాలను కొనుగోలు చేసి ప్రహరీలు నిర్మించి పచ్చని చెట్లను పెంచడంతోపాటు వ్యవసాయం చేస్తున్నారు. కొందరు ఫాంహౌస్‌ల నిర్మించారు. ఈత కొలనులు, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. తొలి రోజుల్లో వారాంతాల్లో కుటుంబసమేతంగా వెళ్లి హాయిగా గడిపేవారు. క్రమేపీ డిమాండ్‌ పెరగడంతో అద్దెకు ఇస్తున్నారు.

  • 25 వేలు

శివారుల్లోని ఫాంహౌస్‌లు, రిసార్టులు

  • 15 వేలు

నిషేధిత ప్రాంతాల్లో ఉన్నవి

  • 70 శాతం

అనుమతి లేని నిర్మాణాలు

  • అద్దె రోజుకు

రూ.25 వేల నుంచి రూ.75 వేలు

వినియోగంలో మార్పు

క్రమేపీ ఫాంహౌస్‌ల వినియోగంలో మార్పు వచ్చింది. కొన్నింటిని యథేచ్ఛగా మద్యం తాగుతూ, జూదం ఆడుకొనేందుకు వినియోగిస్తున్నారు. కొన్ని చోట్ల పెద్దఎత్తున అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. విద్యార్థులు వాటికి వెళుతూ మత్తుపదార్థాలు తీసుకొంటున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల అజీజ్‌నగర్‌ ఫాంహౌస్‌లో 30 మంది గంజాయి తాగుతూ పోలీసులకు చిక్కారు. మంచిరేవులలో జూదమాడుతున్న నగరానికి చెందిన 30 మంది ప్రముఖులను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కొంతమంది లీజుకు తీసుకొని పేకాట క్లబ్‌లుగా మార్చినట్లు పోలీసులకు తెలిసినా, దాడులు చేయకపోవడానికి ప్రధాన కారణం భారీఎత్తున మామూళ్లు అందుతుండటమే. భవిష్యత్తులో వీటిల్లో పలు అవాంఛనీయ ఘటనలను చోటుచేసుకునే ప్రమాదం ఉందని అధికారులే చెబుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు వీటిపై సమీక్ష చేసి తక్షణ చర్యలకు ఉపక్రమించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: Naga Shourya farmhouse issue: చుట్టూ బాడీగార్డులు.. ప్రముఖులతో వాట్సాప్‌ గ్రూపులు

మోహన్‌బాబు ఫాంహౌస్‌ ఘటనలో నిందితుల రిమాండ్‌

Gambling Case: యంగ్ ​హీరో ఫాంహౌస్​లో పేకాట.. మాజీ ఎమ్మెల్యే సహా 30 మంది అరెస్ట్

SOT police hyderabad: ఫామ్‌హౌస్‌లో పేకాట నిర్వహణపై ముమ్మర దర్యాప్తు

Police arrested Poker Players : 10మంది పేకాటరాయుళ్ల అరెస్టు.. నిందితుల్లో పలువురు ప్రజాప్రతినిధులు!

Playing cards: కొత్త అడ్డాల కోసం అన్వేషణ.. ఎల్లలు దాటుతున్న జూదం..

ABOUT THE AUTHOR

...view details