తెలంగాణ

telangana

Telangana Top News: టాప్​న్యూస్ 11AM

By

Published : Sep 11, 2022, 11:03 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News: టాప్​న్యూస్ 11AM
Telangana Top News: టాప్​న్యూస్ 11AM

  • అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు..

అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీఎస్​ సోమేశ్​కుమార్​ ఏర్పాట్లు చేస్తున్నారు.

  • రాజకీయాల్లోనూ 'రెబల్' ముద్ర.. వాజ్​పేయీ హయాంలో కేంద్రమంత్రిగా..

దాదాపు 50 ఏళ్లకుపైగా సినీ రంగాన్ని ఏలిన నటుడు కృష్ణంరాజు.. 1990వ దశకంలో రాజకీయ రంగంపై దృష్టి సారించారు. లోక్​సభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా సేవలందించారు. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఓ సారి తెలుసుకుందాం.

  • కేసీఆర్‌తో భేటీ కానున్న కర్ణాటక మాజీ సీఎం.. వాటిపైనే చర్చ..!

నేడు సీఎం కేసీఆర్‌తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ కానున్నారు. ఇరువురు నేతలు ప్రధానంగా జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం భోజనం తర్వాత ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు.

  • నీవు లేని ఈ బతుకేల.. భార్య మరణాన్ని తట్టుకోలేక..!

WIFE AND HUSBAND DIED: ఆ దంపతులిద్దరూ వివాహం అయినప్పటి నుంచి అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఒక పాప జన్మించింది. కానీ, ఇంతలో వారి దాంపత్య జీవితాన్ని విధి వెక్కిరించింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన భార్య.. చికిత్స పొందుతూ మృతి చెందింది. బ్రహ్మ వేసిన ముడి తెగిందని కలత చెందిన భర్త.. భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తుది శ్వాస వరకూ వెన్నంటి ఉంటానని ప్రమాణం చేసిన భర్త.. అర్ధాంగి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

  • కుండపోత.. ప్రజల వెత.. నేడూ, రేపూ అదే పరిస్థితి..!

Rains in telangana Toady: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు... పొంగి పొర్లుతున్నాయి. మెదక్‌ జిల్లాలో 10 గంటల్లో 16 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

  • దసరా ప్రయాణాలకు తిప్పలు తప్పేలా లేవుగా..

దసరాకు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి రైళ్లలో నిరీక్షణ జాబితా చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. పలు మార్గాల్లో ప్రయాణించే రైళ్లలో బెర్తులన్నీ నిండిపోయాయి. వెయిటింగ్‌ లిస్ట్‌ వందల్లో ఉంటోంది. అటు బస్సు ఛార్జీల మాటెత్తితేనే ప్రయాణికులు ఉలిక్కి పడుతున్నారు. ఇక ఇదే సమయంలో ప్రైవేటు ట్రావెల్స్‌ వారు మాంచి దూకుడులో ధరలను పెట్టారు.

  • దేశంలో మరింత తగ్గిన కరోనా వ్యాప్తి.. జపాన్​లోనూ దిగొచ్చిన కేసులు

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 5,076 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 7,227 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

  • 2024 ఎన్నికలపై PK లేటెస్ట్ ఎనాలసిస్ ఇదీ..

2024 సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయ రాజకీయం ఎలాంటి మలుపులు తిరగనుంది? కమలదళాన్ని ఎదుర్కొనే లక్ష్యంతో కేసీఆర్​, నీతీశ్​, మమత చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? భాజపాయేతర పార్టీలు ఏకతాటిపైకి రాగలవా? వస్తే.. ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు? భారత్​ జోడో యాత్ర మొదలుపెట్టిన కాంగ్రెస్​ గమ్యమెటు?.. ఈ ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులు ఇచ్చారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.

  • 'వీకెండ్స్​లో క్రికెట్ ఆడేందుకు భర్తను పంపుతా'..

పెళ్లిలో వధూవరులు స్నేహితుల హడావుడి అంతాఇంతా కాదు. వధూవరులిద్దరినీ ఆటపట్టిస్తుంటారు. అయితే తమిళనాడు మదురైలోని జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లి కుమార్తెతో ఏకంగా బాండ్​నే రాయించుకున్నారు వరుడి స్నేహితులు. ఆ బాండ్​లో ఏముందో, అసలెందుకు అలా చేశారో ఓసారి చూడండి.

  • యూఎస్​ ఓపెన్​ విజేతగా ఇగా స్వైటెక్‌.. తొలి క్రీడాకారిణిగా రికార్డు

వరుస విజయాలతో ఫుల్​ ఫామ్​లో ఉన్న ఇగా స్వైటెక్‌ ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ 2022 టోర్నీ విజేతగా అవతరించింది. ఈ ట్రోఫీని ముద్దాడిన తొలి పోలెండ్​ మహిళగా రికార్డుకెక్కింది.

ABOUT THE AUTHOR

...view details