ETV Bharat / bharat

దేశంలో మరింత తగ్గిన కరోనా వ్యాప్తి.. జపాన్​లోనూ దిగొచ్చిన కేసులు

author img

By

Published : Sep 11, 2022, 9:33 AM IST

CORONA CASES IN INDIA
కరోనా కేసులు

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 5,076 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 7,227 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Corona Cases in India: దేశంలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 5,076 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 7,227 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.11 శాతంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 47,945 క్రియాశీల కేసులు ఉన్నట్లు తెలిపింది.

Vaccination In India :
దేశంలో శనివారం 17,81,723 కోట్ల మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 214.95 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,20,784 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 3,55,046 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 813 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,34,01,483 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,15,608 మంది మరణించారు. శనివారం మరో 7,63,061 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,17,61,294కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 99,663 కేసులు వెలుగుచూశాయి. మరో 212 మంది మరణించారు.
  • రష్యాలో 69,389 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 97 మంది మృతి చెందారు.
  • దక్షిణ కొరియాలో 42,724 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల 48 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తైవాన్​లో 35,830 కొవిడ్ కేసులు నమోదుకాగా, 30 మంది మరణించారు.
  • ఫ్రాన్స్​లో 19,517 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి.

ఇవీ చదవండి: బాలికపై ఓ ఉన్మాది అత్యాచారయత్నం.. ఆపై కిరోసిన్​​ పోసి

'రాహుల్‌ గాంధీ యాత్ర చేసేది ఆ పనికోసమే'.. షా, ఇరానీ విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.