తెలంగాణ

telangana

Telangana News Today : టాప్​న్యూస్ @ 11AM

By

Published : Aug 6, 2022, 11:00 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today

  • దేశంలో తగ్గిన కరోనా కేసులు

Covid Cases In India: భారత్​లో కొవిడ్​ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 19,406 మంది వైరస్ బారిన పడగా.. 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జపాన్​లో 2.5 లక్షలు, దక్షిణ కొరియాలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.

  • ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ షురూ.. ఓటేసిన మోదీ

Vice president election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోక్​సభ, రాజ్యసభ ఎంపీలు ఓటేసేందుకు లైన్లలో నిల్చున్నారు.

  • 'సీఎం దొంగ అంటూ నినాదాలు!'.. కర్రలతో దాడి చేసిన ఎమ్మెల్యే!

బంగాల్​లో టీఎంసీ, భాజపా వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ర్యాలీలో పాల్గొన్న భాజపా కార్యకర్తలపై టీఎంసీ ఎమ్మెల్యే, కార్యకర్తలు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హుగ్లీలోని చిసురాలో జరిగింది.

  • ప్రసాద్​గౌడ్ జీవన్​రెడ్డిని చంపేందుకే వచ్చాడు

MLA Jeevan Reddy Murder Attempt : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్​రెడ్డిపై హత్యాయత్నం కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. నిందితుడు ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యేను చంపేందుకే వచ్చాడని వెల్లడించారు. దీనికోసం రెండు నెలల నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని గుర్తించారు. అతడికి ఆయుధాలు సమకూర్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

  • వాగులో చిక్కుకున్న రైతులు.. రక్షించిన సహాయక బృందాలు

Farmers Stuck in flood at Jangaon : వ్యవసాయ పనుల కోసం వెళ్లిన కూలీలు వాగులో చిక్కుకున్న ఘటన జనగామ జిల్లా దేవరప్పుల మండలం పెద్దమడూరు వాగులో చోటుచేసుకుంది. వాగులో చిక్కుకు పోయిన నలుగురు రైతులు పోలీసులు, సహాయ బృందాల సాయంతో గ్రామస్థులు రక్షించారు. తాళ్ల సాయంతో వారిని అర్ధరాత్రి రక్షించిన అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

  • 'రాష్ట్రంలో బోగస్‌ ఓట్ల తొలగింపు తీరు భేష్‌'

bogus votes in telangana: బోగస్ ఓట్ల తొలగింపు విషయంలో తెలంగాణ ఎన్నికల సంఘం తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం ఉప ముఖ్య ఎన్నికల అధికారి సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే ఫొటోతో ఉన్న ఓటర్లను గుర్తించి.. జాబితా నుంచి వారి పేర్లను తొలగించిన తీరు బాగుందంటూ కితాబిచ్చారు. ఎన్నికల సంఘం కొత్తగా రూపొందించిన దరఖాస్తుల అమలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు హైదరాబాద్​ వచ్చిన ఆయన.. అధికారులతో కలసి నూతన విధానాల అమలు తీరుతెన్నులను సమీక్షించారు.

  • సునాక్​కు కొత్త ఉత్సాహం.. టీవీ చర్చలో 'ఆమె'పై గెలుపు

UK PM race: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీలో ఉన్న రిషి సునాక్.. తాజాగా ఓ టీవీ చర్చలో విజయం సాధించారు. గురువారం రాత్రి ఓ టీవీ ఛానెల్​లో చర్చ జరిగింది. ఇందులో ఎవరు విజయం సాధించారనే విషయంపై నిర్వహించిన ఎన్నికలో సునాక్‌కే పార్టీ సభ్యులు ఆధిక్యం కట్టబెట్టారు.

  • 'అంపైర్ చీటింగ్'.. హాకీలో మహిళల జట్టు ఓటమి.. షూటౌట్లో తేలిన సెమీస్ ఫలితం

Commonwealth games 2022: కామన్​వెల్త్​ గేమ్స్​లో భాగంగా జరిగిన మహిళల హాకీలో భారత్​.. ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. 1-1తో మ్యాచ్​ డ్రా కావడం వల్ల నిర్వహించిన షూటౌట్​లో 3-0 తేడాతో పరాజయం పాలైంది.

  • హెవీ వెపన్స్​ ట్రెండ్​​.. ఈ యాక్షన్​ సీక్వెన్స్​ హైలైట్​.. ప్రభాస్​ రిపీట్ చేస్తాడా?

కొన్ని కొన్ని చిత్రాల్లో ఆయుధాలు కూడా కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఆ ఆయుధాలతో మన కథానాయకులు చేసే యాక్షన్​ సీక్వెన్స్​ సినిమాకే హైలైట్​గా నిలుస్తుంటాయి. అలా ఈ మధ్య కాలంలో 'కేజీయఫ్ 2', 'విక్రమ్'​ వంటి సినిమాలు చూస్తే.. భారీ, పవర్​ఫుల్​ గన్​లను ఉపయోగించడం ట్రెండ్ అయిందనే చెప్పాలి. ఇంకా ఏఏ చిత్రాలు అలాంటి యాక్షన్​ సీన్స్​ను రిపీట్​ చేస్తున్నాయంటే...

  • దుల్కర్​కు జోడీగా సమంత..

చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది నటి సమంత. ప్రస్తుతం ఆమె నటించిన 'శాకుంతలం' నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. 'యశోద', 'ఖుషి' చిత్రాలు సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి. మరోవైపు హిందీలో తెరంగేట్రం చేసేందుకు కొన్ని కథలు ఓకే చేసి పెట్టుకున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పుడామె ఖాతాలో ఓ మలయాళ చిత్రం చేరినట్లు తెలుస్తోంది. అదే 'కింగ్‌ ఆఫ్‌ కోత'. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. అభిలాష్‌ జోషి తెరకెక్కిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details