ETV Bharat / bharat

దేశంలో తగ్గిన కరోనా కేసులు.. జపాన్​లో రెండున్నర లక్షలకు పైగా..

author img

By

Published : Aug 6, 2022, 9:24 AM IST

covid cases in india
భారత్​లో కరోనా కేసులు

Covid Cases In India: భారత్​లో కొవిడ్​ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 19,406 మంది వైరస్ బారిన పడగా.. 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జపాన్​లో 2.5 లక్షలు, దక్షిణ కొరియాలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.

Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం మధ్య 19,406 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 4.96 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 19,928 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి.

  • మొత్తం కేసులు : 4,40,59,768
  • మొత్తం మరణాలు: 5,26,649
  • యాక్టివ్​ కేసులు: 1,34,793
  • కోలుకున్నవారి సంఖ్య: 4,34,65,552

Vaccination India:
భారత్​లో శుక్రవారం 32,73,551 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 205.92 కోట్లు దాటింది. మరో 3,91,187 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 7,97,544 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,953 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,74,35,147కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,33,539 మంది మరణించారు. ఒక్కరోజే 9,39,950 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,80,33,772కు చేరింది.

  • జపాన్​లో 2,53,392 కేసులు నమోదు కాగా.. 183 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో తాజాగా 1,12,857 కేసులు నమోదు కాగా.. 47 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో 89,240 కేసులు నమోదయ్యాయి. 400 మంది మరణించారు.
  • ఇటలీలో కొత్తగా 38,215 మందికి కరోనా సోకింది. 175 మంది బలయ్యారు.
  • ఆస్ట్రేలియాలో తాజాగా 32,580 మందికి కొవిడ్ సోకగా.. 82 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి : Precaution Dose: పది కోట్లు దాటిన ప్రికాషన్‌ డోసుల పంపిణీ

హైటెక్‌ యుద్ధాలకు భారత్‌ సన్నద్ధం.. కొత్త వ్యూహాలకు పదును!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.