ETV Bharat / state

bogus votes in telangana : 'రాష్ట్రంలో బోగస్‌ ఓట్ల తొలగింపు తీరు భేష్‌'

author img

By

Published : Aug 6, 2022, 9:59 AM IST

Updated : Aug 6, 2022, 10:19 AM IST

bogus votes in telangana: బోగస్ ఓట్ల తొలగింపు విషయంలో తెలంగాణ ఎన్నికల సంఘం తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం ఉప ముఖ్య ఎన్నికల అధికారి సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకే ఫొటోతో ఉన్న ఓటర్లను గుర్తించి.. జాబితా నుంచి వారి పేర్లను తొలగించిన తీరు బాగుందంటూ కితాబిచ్చారు. ఎన్నికల సంఘం కొత్తగా రూపొందించిన దరఖాస్తుల అమలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు హైదరాబాద్​ వచ్చిన ఆయన.. అధికారులతో కలసి నూతన విధానాల అమలు తీరుతెన్నులను సమీక్షించారు.

రాష్ట్రంలో బోగస్‌ ఓట్ల తొలగింపు తీరు భేష్‌
రాష్ట్రంలో బోగస్‌ ఓట్ల తొలగింపు తీరు భేష్‌

bogus votes in telangana: ‘ఒకే ఫొటోతో ఉన్న ఓటర్లను గుర్తించి.. జాబితా నుంచి వారి పేర్లను తొలగించటంలో తెలంగాణ ఎన్నికల సంఘం తీరు బాగుంది’ అంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉప ముఖ్య ఎన్నికల అధికారి నితీశ్‌కుమార్‌ వ్యాస్‌ కితాబిచ్చారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో పాటు నమోదుకు కొత్తగా ఎన్నికల సంఘం రూపొందించిన దరఖాస్తుల అమలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఆయన శుక్రవారం హైదరాబాద్‌ వచ్చారు. అధికారులతో కలసి నూతన విధానాల అమలు తీరుతెన్నులను సమీక్షించారు.

ఈ సందర్భంగా ‘తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 10 లక్షల మంది బోగస్‌ ఓటర్లను తొలగించటం విశేషం. కొందరు వ్యక్తులు ఒకే ఫొటోతో పలు ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అలాంటి వారిని గుర్తించి తొలగించే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది. తెలంగాణ నుంచి ఎక్కువ మందిని తొలగించగలిగారు. ఓటర్ల జాబితాలో ఆధార్‌ను అనుసంధానించే విధానానికి స్పందన లభించింది.

తొలి వారంలో 20 వేల మంది ఓటర్లు స్వచ్ఛందంగా ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేసుకున్నారు. ఈ ప్రక్రియను 2023 ఏప్రిల్‌ వరకు అమలుచేస్తాం’ అని నితీశ్​కుమార్​ పేర్కొన్నారు. జాబితా సవరణ ప్రక్రియ సందర్భంగా ప్రజల సందేహాలను ఎలా నివృత్తి చేస్తున్నారన్నది కూడా నితీశ్‌కుమార్‌ వ్యాస్‌ పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షించే ముఖ్య కార్యదర్శి అవినాశ్‌కుమార్‌, తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులు సత్యవాణి, రవికిరణ్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిషనర్‌ డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఇవీ చూడండి.. ఓటరు జాబితాతో ఆధార్‌ అనుసంధానం!

Vice president election: నేడే ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ధన్‌ఖడ్‌ ఎన్నిక లాంఛనమే

Last Updated :Aug 6, 2022, 10:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.