తెలంగాణ

telangana

Telangana news Today : టాప్​న్యూస్ @ 9AM

By

Published : Jun 22, 2022, 8:57 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana news Today
Telangana news Today

  • అగ్నిపథ్​ సైనిక నియామకాల్లో ఎలాంటి మార్పు ఉండదు

అగ్నిపథ్​​ పథకం కింద నియమించే సైనిక నియామక ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదని త్రివిధ దళాల ఉన్నతాధికారులు వెల్లడించారు. విద్యార్హతలు, పరీక్ష సిలబస్‌, వైద్యప్రమాణాల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. రిక్రూట్‌మెంట్లపై సవివర షెడ్యూల్‌ విడుదల చేశారు.

  • శిందే వెంట 40 మంది ఎమ్మెల్యేలు

మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తిరుగుబావుటా ఎగురవేసిన మంత్రి, శివసేన నేత ఏక్​నాథ్​ శిందే వెంట 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. వీరంతా ఒకవేళ భాజపాలో చేరితే ప్రభుత్వం పడిపోవడం ఖాయం. మంగళవారం గుజరాత్​లో ఓ హోటల్​లో ఉన్న ఈ బృందం.. ఇప్పుడు అసోంకు వెళ్లింది. ఈ నేపథ్యంలో శిందే చేసిన ఓ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

  • మోదీ వచ్చాకే కూలుతున్న ప్రభుత్వాలు

మహారాష్ట్రలో అధికార కూటమిలోని ప్రధాన భాగస్వామి శివసేనలో అసమ్మతి భగ్గుమంది. మంత్రి ఏక్​నాథ్​ శిందే తిరుగుబాటుతో.. ఉద్ధవ్​ ఠాక్రే సర్కార్​ పతనం అంచున నిలిచింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో భాజపాయేతర ప్రభుత్వాలు కుప్పకూలాయి. బిహార్​, మధ్యప్రదేశ్​, కర్ణాటక సహా ఇలా ఎన్నో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

  • వాళ్లు పోరాటానికి పనికిరారు

భారత్‌లోని జాతి, కుల వ్యవస్థలతో 'ఆడుకున్న' ఆంగ్లేయులు సరికొత్తగా రెండు జాతులను సృష్టించారు. అవే పోరాడగల... పోరాడలేని జాతులు (మార్షల్‌ రేస్‌)! తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం కోసం 'విభజించు-పాలించు' సిద్ధాంతంలో భాగంగా భారతీయులకు ఈ ముద్ర వేశారు. ఆ విభజన ఆధారంగా కొన్ని వర్గాలు, ప్రాంతాలవారికే సైన్యంలో ప్రాధాన్యమిస్తూ... తమకు నచ్చని, మాట వినరనుకున్న వారిని పక్కనబెట్టారు.

  • 'విద్యా'హామీల అమల్లో తాత్సారం

విద్యా సంవత్సరం ప్రారంభమైనా విద్యాశాఖకు సంబంధించి పలు అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో నేటికీ కదలిక కనిపించట్లేదు. దీనివల్ల అంతిమంగా విద్యార్థులు నష్టపోతున్నారు. విద్యాసంస్థల్లో అమ్మాయిలకు శానిటరీ కిట్ల సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల నియామకాల ఊసే లేదు. బడి ఫీజులపై నియంత్రణ చట్టం మాటలకే పరిమితమైంది. ఇలా సమస్యల విలయంలో విద్యాలయాలు కొట్టుమిట్టాడుతున్నాయి.

  • 'ఆస్తుల నమోదు అప్డేట్ ప్రక్రియలో అలసత్వం తగదు'

రాష్ట్రంలో ఆస్తుల నమోదు అప్డేట్ ప్రక్రియపై నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని, ఎక్కడా అలసత్వం తగదని ఆయన పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు రికార్డులు, ఆన్​లైన్​లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆధికారులు, ఇంజినీర్లకు స్పష్టం చేశారు.

  • పెళ్లిపేరుతో యువకుడికి వల.. రూ.6.5 కోట్లు స్వాహా

జీవితంలో సరైన తోడును వెతుక్కునేందుకూ ఎన్నో డిజిటల్‌ వేదికలు వచ్చాయి. తమకు నచ్చిన వరుడు, వధువు కోసం.. ఎంతో మంది వీటిని ఆశ్రయిస్తున్నారు. వాటిని ఆసరాగా చేసుకుని కొందరు మాట్రిమోని వెబ్‌సైట్‌లో ఫేక్ ప్రొఫైల్స్ పెట్ట‌డం. ఆక‌ర్షించే బ‌యోడేటాను ఉంచ‌డం.. ఆ త‌ర్వాత ఎవ‌రైనా ఆన్​లైన్​లోకి వ‌స్తే వారిని పెళ్లి పేరుతో మోసం చేయ‌డం సాధారణమైంది. కానీ తాజాగా మ్యాట్రిమోనిలో పనిచేస్తున్న ఓ కిలేడి మాత్రం వివాహ వేదికను ఆశ్రయించిన యువకుడిని తానే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఘరానా మోసానికి పాల్పడింది.

  • మూడు దేశాల్లో భారీ భూకంపం

పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​, మలేషియాల్లో తీవ్ర భూకంపం సంభవించింది. పాక్​, అఫ్గాన్​లలో 6.1గా.. మలేషియాలో 5.61గా భూకంప తీవ్రత నమోదైంది. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

  • దీపక్​కు మరో ఐదు వారాలు.. లాంక్‌షైర్‌కు సుందర్​

తాను గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరో ఐదు వారాలు పట్టే అవకాశముందని ఫాస్ట్​బౌలర్​ దీపక్​ చాహర్​ అన్నాడు. మరోవైపు చేతి గాయం నుంచి కోలుకున్న స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కౌంటీల్లో ఆడటానికి సిద్ధమవుతున్నాడు.

  • షారుఖ్​, సూర్య.. ఒక్క పైసా తీసుకోలేదట

తన సినిమా 'రాకెట్రీ'లో నటించేందుకు హీరోలు సూర్య, షారుఖ్​ ఒక్క పైసా కూడా తీసుకోలేదని అన్నారు కథానాయకుడు మాధవన్​. వారిద్దరి పాత్ర అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఇంకా చిత్ర విశేషాలను తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details