తెలంగాణ

telangana

మోదీ హైదరాబాద్‌ పర్యటనకు భద్రతా ఏర్పాట్లు.. వారిపై ముందస్తు చర్యలు

By

Published : May 24, 2022, 1:29 PM IST

Modi Hyderabad Tour : ఈనెల 26న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఐఎస్‌బీ విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. వివరాలు మాత్రం సైబరాబాద్ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

Modi Hyderabad Tour
Modi Hyderabad Tour

Modi Hyderabad Tour : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 26న తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం.. ముందస్తు చర్యల్లో భాగంగా ఐఎస్‌బీ విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. వారి వివరాలు మాత్రం సైబరాబాద్‌ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.

Modi Attends ISB Annual Celebrations : ప్రధాని పర్యటన నేపథ్యంలో మోదీకి ఘనస్వాగతం పలకడంతో పాటు సీనియర్‌ నేతలతో భేటీకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రయత్నిస్తున్నారు. అనుమతి కోసం ప్రధానమంత్రి కార్యాలయాని(పీఎంవో)కి సమాచారం పంపించారు. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో చర్చించారు. బేగంపేటలో పార్టీ నేతలు ప్రధానమంత్రిని కలిసేలా రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఈనెల 26న రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని ప్రధానితో ప్రారంభింపజేసే కార్యక్రమానికి సన్నాహాలు జరిగాయి. అయితే ఐఎస్‌బీ కార్యక్రమం తర్వాత ప్రధాని చెన్నైకి వెళ్తారని భాజపా వర్గాల సమాచారం.

Modi Visits ISB Hyderabad : సోషల్ మీడియాలో మోదీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవడాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. ఐఎస్‌బీ విద్యార్థులపై నిఘా పెట్టారని.. అది అప్రజాస్వామికమని ఆరోపించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బిజినెస్‌ స్కూల్‌ అని.. అందులో శిక్షణ పొందిన విద్యార్థులు కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం ఉందని చెప్పారు. అలాంటి విద్యార్థులు సోషల్‌ మీడియాలో ప్రధానికి వ్యతిరేకంగానో, ప్రజాస్వామ్యానికి అనుకూలంగానో పోస్ట్‌ చేస్తే అలాంటి వారిపై నిఘా ఉంచి వార్షికోత్సవానికి రాకుండా బ్లాక్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details