తెలంగాణ

telangana

Premium Brands Liquor Sales: నేటి నుంచి ప్రీమియం బ్రాండ్ల మద్యం విక్రయాలు.. కారణమిదే..!

By

Published : Dec 31, 2021, 5:31 PM IST

Premium Brands Liquor Sales: ఆంధ్రప్రదేశ్​లో ఇవాళ్టి నుంచి ప్రీమియం బ్రాండ్ల మద్యం అందుబాటులోకి రానుంది. ప్రీమియం బ్రాండ్ల మద్యం.. పొరుగు రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ జరుగుతుండటంతో.. ఆయా బ్రాండ్లను ఏపీలోనే విక్రయించేందుకు అనుమతి ఇస్తూ ఆంధ్రా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Premium Brands Liquor in AP
Premium Brands Liquor in AP

Premium Brands Liquor Sales: ఇవాళ్టి నుంచి ఏపీలో ప్రీమియం బ్రాండ్ల మద్యం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏపీ అబ్కారీ శాఖ అనుమతి ఇచ్చింది. ఇక నుంచి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్​కు చెందిన మద్యం దుకాణాలు, ఇతర రిటైల్ అవుట్​లెట్లతో సహా బార్లు, వాకిన్ స్టోర్లలో ప్రీమియం బ్రాండ్ల మద్యం విక్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పొరుగు రాష్ట్రాల నుంచి ప్రీమియం బ్రాండ్ల మద్యం స్మగ్లింగ్ జరుగుతుండటంతో వాటిని ఏపీలోనే విక్రయించేందుకు అనుమతి ఇస్తూ ఆ రాష్ట్ర సర్కార్​ ఆదేశాలిచ్చింది. దీంతో ఇవాళ్టి నుంచి ప్రీమియం బ్రాండ్ల విక్రయాలు.. అన్ని మద్యం దుకాణాల్లో జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details